MLA Samuel Fired on Ilaiah : ప్ర‌భుత్వ విప్ ఐల‌య్య‌పై ఎమ్మెల్యే సామెల్ ఫైర్

కాంగ్రెస్ పార్టీలో స్వంత పార్టీ ఎమ్మెల్యేల ఆగ్ర‌హం

Hello Telugu - MLA Samuel Fired on Ilaiah

Hello Telugu - MLA Samuel Fired on Ilaiah

MLA Samuel : హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ లోపించింది. ఓ వైపు న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి స్వంత స‌ర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. మ‌రో పైపు పాల‌మూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఓ వ‌ర్గంగా ఇప్ప‌టికే గుర్తింపు పొందారు. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి ప్ర‌భుత్వ విప్ , ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐల‌య్య‌పై స్వంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే మందుల సామెల్ (MLA Samuel) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బీర్ల ఐలయ్య లఫంగి రాజకీయాలు చేయకు అంటూ వార్నింగ్ ఇచ్చారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో త‌మ ప్రాంత నాయకులు కొంతమంది బిఆర్ఎస్ పార్టీ తో పొత్తు పెట్టుకుంటున్నారని మండిప‌డ్డారు. రాజకీయ వ్యభిచారం చేయ‌డం మానుకోవాల‌ని అన్నారు.

MLA Samuel Slams Ilaiah

మీ బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీ ని బొంద పెట్టాల‌ని చూడొద్దంటూ హిత‌వు ప‌లికారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నైతికంగా బాధ్యత వహిస్తూ బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే కుట్ర చేస్తున్నాడని ఆరోప‌ణ‌లు గుప్ప‌తించారు. ప్రలోభాలకు గురి కాకుండా ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల‌ని కోరారు మందుల సామేల్. కాంగ్రెస్ పార్టీ ఓడితే నాయకులు, కార్యకర్తలు మీకు సరైన బుద్ది చెపుతారంంటూ మండిప‌డ్డారు. బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి రాజకీయ వ్యభిచారం చేస్తే మంచిదని హిత‌వు ప‌లికారు. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : Minister Atchannaidu Fired on YS Jagan : రైతుల గురించి మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ కు లేదు

Exit mobile version