Minister Atchannaidu Fired on YS Jagan : రైతుల గురించి మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ కు లేదు

శాస‌న మండ‌లిలో మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

Hello Telugu - Minister Atchannaidu Fired on YS Jagan

Hello Telugu - Minister Atchannaidu Fired on YS Jagan

Minister Atchannaidu : అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) శాస‌న మండలిలో వైసీపీ పై నిప్పులు చెరిగారు. ప్రజల గుండెల్లో ఓటమి ముద్ర వేసుకున్న వైసీపీ, కూటమి ప్ర‌భుత్వ‌ విజయాలపై నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. అభివృద్ధి, సంక్షేమం, విశ్వసనీయత కూటమి ప్ర‌భుత్వ రూపం అన్నారు. కానీ ద్రోహం, అవినీతి, అహంకారం వైసీపీ అసలు స్వరూపం అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ వైఫల్యాలను క‌ప్పి పుచ్చుకునేందుకు కూటమి విజయాలపై మట్టి చల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. గ‌త ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంశం సృష్టించి, 9.5 ల‌క్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని మండిప‌డ్డారు, ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక హ‌క్కు వైసీపీకి లేదన్నారు. ప్ర‌తి శాఖ‌లో అప్పులు చేశారని వాపోయారు.

Minister Atchannaidu Slams YS Jagan

అద్భుత‌మైన అన్నా క్యాంటిన్ ను తొల‌గించవ‌ద్ద‌ని ఆనాడు అసెంబ్లీలో జ‌గ‌న్ ను వేడుకున్నామ‌ని కానీ త‌న మ‌న‌సు క‌ర‌గ‌లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప‌నిగ‌ట్టుకొని పేద‌లకు 5 రూపాయ‌ల‌ భోజ‌నాన్ని దూరం చేశారని అన్నారు. వైసీపీ హ‌యాంలో రైతు భ‌రోసా అంటూ రైతుల్ని మోసం చేశారని పేర్కొన్నారు. రూ. 12,500 పెట్టుబ‌డి సాయంలో కేంద్రం సాయాన్ని క‌లిపి ఇచ్చి రైతుల్ని ద‌గా చేశారని ఫైర్ అయ్యారు అచ్చెన్నాయుడు. ప్ర‌తి ఏడాది జాబ్ క్యాలెండ‌ర్ ఇస్తామ‌ని నిరుద్యోగుల‌ను నిండా ముంచారని అన్నారు. నేడు శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నారు..సిగ్గుందా అని ప్ర‌శ్నిస్తున్నానని మండిప‌డ్డారు. ప్ర‌జ‌లు వైసీపీని తిర‌స్క‌రించార‌ని అయినా మార‌డం లేద‌న్నారు. మంచి స‌ల‌హాలు ఇవ్వ‌డం నేర్చుకోవాల‌ని సూచించారు.

Also Read : Maganti Sunitha Challenge : జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల బ‌రిలో మాగంటి సునీత‌

Exit mobile version