Raja Singh : హైదరాబాద్ – బీజేపీ అధ్యక్ష ఎంపిక వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తను పార్టీకి గుడ్ బై చెప్పడంతో పాటు ఆ పార్టీపై సీరియస్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. అధ్యక్ష పదవిని రామచందర్ రావుకు లైన్ క్లియర్ చేసింది పార్టీ హైకమాండ్. తనను గనుక పార్టీ ప్రెసిడెంట్ చేస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ లాగా చేస్తానంటూ ప్రకటించారు. ఆపై సంచలన ఆరోపణలు కూడా చేయడం రాద్దాంతానికి దారి తీసింది. దీనిపై పార్టీ స్పందించింది.
MLA Raja Singh Sensational Decision
ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) చేసిన ఆరోపణలను ఖండించింది భారతీయ జనతా పార్టీ. తమకు వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని స్పష్టం చేసింది. గతంలో కూడా ఇలాగే కామెంట్స్ చేశాడని, తనను సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపింది. చివరకు తప్పైందని చెప్పడంతో తిరిగి పార్టీలోకి తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా మంగళవారం మీడియాతో మాట్లాడారు పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పాయల్ శంకర్, పార్టీ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ.
ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన విమర్శల్లో వాస్తవం లేదన్నారు. పార్టీ అందరికీ నామినేషన్ వేసేందుకు అవకాశం ఇచ్చిందన్నారు. తన అనుచరులను బెదిరించారంటూ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వెల్లడించింది. ఇది మంచి పద్దతి కాదని సూచించింది. పార్టీ లైన్ దాటి మాట్లాడటం ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా రాజా సింగ్ తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం సంచలనం కలిగించింది. పార్టీ చీఫ్ కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ సమర్పించారు.
పార్టీ అధ్యక్షుడి ఎన్నిక దాదాపు ఖరారైందని, కేవలం నామ్ కే వాస్తేగా ఈ ఎన్నిక నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు. తాను నిజమైన హిందువునని, తాను ఎందరికో టార్గెట్ అయ్యానని వాపోయారు ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీతో తనకు సంబంధం లేదన్నారు. తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించాలని కిషన్ రెడ్డిని కోరానని అన్నారు.
Also Read : TG High Court Sensational : అధికారుల ఉదాసీనతపై హైకోర్టు ఆగ్రహం
