MLA Raja Singh Shocking Comments : 50 ఏళ్ల‌యినా బీజేపీ అధికారంలోకి రాదు

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్

Hello Telugu - MLA Raja Singh Shocking Comments

Hello Telugu - MLA Raja Singh Shocking Comments

MLA Raja Singh : హైద‌రాబాద్ : గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja Singh) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ శాస‌న స‌భకు సంబంధించి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థి లంకాల దీప‌క్ రెడ్డికి డిపాజిట్ ద‌క్క‌క పోవ‌డం ప‌ట్ల స్పందించారు. తెలంగాణలో బీజేపీ మరో 50 ఏళ్ల దాకా అధికారంలోకి రాదన్నారు. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇక ఎప్ప‌టికీ ప‌వ‌ర్ లోకి రాదేమోన‌న్న అనుమానం త‌న‌కు క‌లుగుతోంద‌ని అన్నారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా బీజేపీ విజ‌య‌పు బావుటా ఎగుర వేస్తుంటే తెలంగాణ‌లో మాత్రం చూసీ చూడ‌న‌ట్లు నేత‌లు వ్య‌వ‌హ‌రించ‌డం దారుణ‌మ‌న్నారు.

MLA Raja Singh Shocking Comments on BJP

తెలంగాణలో బీజేపీ చని పోతోందని ఇక‌నైనా కిషన్ రెడ్డి దయచేసి కాపాడాల‌ని కోరారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. పార్టీలో ఆధిప‌త్య ధోర‌ణి వ‌ల్ల అభ్య‌ర్థికి క‌నీసం డిపాజిట్ ఓట్లు రాలేద‌న్నారు. మిగ‌తా పార్టీలు ప‌క‌డ్బందీగా ప్ర‌చారం చేప‌ట్టాయ‌ని అన్నారు. ముందుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం, వారి గెలుపు కోసం శ‌క్తి వంచ‌న లేకుండా చేశాయ‌న్నారు. ఇదే స‌మ‌యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో బై పోల్ ఎన్నిక‌ల్లో గెలిచింద‌ని దీని వెనుక ఎవ‌రు ఉన్నారో తెలుసుకుంటే మంచిద‌న్నారు. క‌ష్ట‌ప‌డే కార్య‌క‌ర్త‌లు, నిబ‌ద్ద‌త క‌లిగిన నేత‌లు పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ ఎందుక‌ని డిపాజిట్ రాలేదో తెలుసు కోవాల‌ని సూచించారు.

Also Read : CM Chandrababu Clear Update : శ్రీ సిటీలో 5 యూనిట్లు ప్రారంభం

Exit mobile version