CM Chandrababu Clear Update : శ్రీ సిటీలో 5 యూనిట్లు ప్రారంభం

ఏపీ సీఎం చంద్ర‌బాబు సంతోషం

Hello Telugu - CM Chandrababu Clear Update

Hello Telugu - CM Chandrababu Clear Update

CM Chandrababu : విశాఖ‌ప‌ట్నం : వైజాగ్‌లో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో శ్రీ సిటీకి వస్తున్న 12 కొత్త పరిశ్రమలకు 5 యూనిట్లను ప్రారంభించడం ఆనందంగా ఉంద‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu). అవగాహన ఒప్పందాల మార్పిడిలో పాల్గొనడం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ పరిశ్రమలు భారతదేశం, అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, జర్మనీ, బెల్జియం, జపాన్, సింగపూర్‌లను సూచిస్తాయని చెప్పారు. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఇంజనీరింగ్, సహజ వాయువు పంపిణీ, ఆహార ప్రాసెసింగ్, ఫార్మా, హెల్త్‌కేర్ , పేపర్, ప్యాకేజింగ్ వంటి రంగాలను కలిగి ఉన్నాయని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్బంగా ఈ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేస్తున్నానని నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు.

CM Chandrababu Comments

ఇదే స‌మ‌యంలో అన్ని కంపెనీలను మన రాష్ట్రానికి హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నానని చెప్పారు. వారి వృద్ధి ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు సీఎం. అదనంగా, భారతదేశంలోని అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రాలలో ఒకటిగా దాని స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము శ్రీ సిటీకి సుమారు 2500 ఎకరాలను కేటాయిస్తామ‌ని సీఐఐ స‌ద‌స్సు వేదిక‌గా ప్ర‌క‌టంచారు నారా చంద్రబాబు నాయుడు. ఇప్ప‌టికే శ్రీ సిటీలో ప‌లు కంపెనీలు కొలువు తీరి ఉన్నాయ‌ని చెప్పారు. దీని ద్వారా ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని చెప్పారు.

Also Read : KTR Fired on Congress : కాంగ్రెస్ గూండాయిజం కేటీఆర్ ఆగ్ర‌హం

Exit mobile version