KTR : భూపాలపల్లి జిల్లా – తెలంగాణ కొంగు బంగారంగా పేరు పొందిన సింగరేణిని కాంగ్రెస్, బీజేపీలు ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ఆ రెండు పార్టీల నాయకులకు తెలంగాణ మీద ప్రేమ అస్సలే లేదన్నారు తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు కొట్లాడేది ఒక్క కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌తో 117 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవడం రేవంత్ చేతకానితనానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు.
MLA KTR Shocking Comments on Congress Govt
సీఎం అయ్యాక మూడు వేల మంది గురుకుల విద్యార్థులు విషాహారంతో ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించారు. గురుకుల విద్యార్థుల మరణాల్లో, ఫుడ్ పాయిజనింగ్ సంఘటనల్లో తెలంగాణ రైజింగ్ అయిందన్నారు. గురుకులాల పిల్లలకు పెడుతున్న విషాన్ని తన ఇంట్లో పిల్లలకు పెడితే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా అని ప్రశ్నించారు. తెలంగాణ భవిష్యత్తు అయిన పిల్లలు ఆగమవుతుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ఆంధ్రకు నీళ్లు, ఢిల్లీకి నిధులు, చంద్రబాబు తొత్తులకు నియామకాలు ఇస్తున్నారని ఆరోపించారు. వచ్చే 100 ఏళ్ల పాటు హైదరాబాద్‌కు తాగునీటి కరువు లేకుండా ముందు చూపుతో కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారు. చేసిన పనిని సరిగా చెప్పుకోలేక మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాం అన్నారు.
చిన్నచిన్న ఇబ్బందులను ఇప్పటినుంచే పరిష్కరించుకొని సమన్వయంతో పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో, బొగ్గుగని కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాం అన్నారు కేటీఆర్. నిబద్ధత కలిగిన నాయకులు, కార్యకర్తలు ఎందరో బీఆర్ఎస్, టీబీజీకేఎస్‌లో ఉన్నారని చెప్పారు. నేను మంత్రిగా వచ్చినప్పటి కంటే ఇప్పుడే కార్యకర్తల్లో ఎక్కువ జోష్ కనిపిస్తుందన్నారు.
Also Read : Deputy CM Bhatti Interesting Announcement : రూ. 22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
