Deputy CM Bhatti : ఖమ్మం జిల్లా – రూ. 22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti). ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై పాల్వంచలోని ఐడిఓసి భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వర్షాలు, ముంపు సమస్యలు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఫోకస్ పెట్టాలన్నారు భట్టి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఎరువుల సరఫరా, రేషన్ కార్డుల పంపిణీ జరగాలన్నారు. అభివృద్ధి పనుల నాణ్యత, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణ చేపట్టాలన్నారు.
Deputy CM Bhatti Vikramarka Announced
ముంపు ప్రాంతాల్లో తాత్కాలిక శిబిరాలు, వైద్య సదుపాయాలు సిద్ధం చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి, ఇసుక సరఫరాలో ఆటంకాలు నివారించాలని అన్నారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయాలన్నారు. గిరిజన రైతులకు ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ పథకం ద్వారా ఉచిత సోలార్ పంప్ సెట్లు, డ్రిప్, స్ప్రింక్లర్లు అందించేలా చూడాలని ఆదేశించారు మల్లు భట్టి విక్రమార్క. మహిళా సంఘాల ద్వారా చేప పిల్లల పెంపకం చేపట్టాలన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంచడం జరిగిందని చెప్పారు. ఉచిత బస్సు పథకానికి రూ. 6,880 కోట్లు చెల్లించామన్నారు.
Also Read : CM Chandrababu – PM Modi Growth : దేశానికి సరైన నాయకుడు ప్రధాని మోదీనే
