MLA Anirudh Reddy Brother Shocking : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సోద‌రుడికి బిగ్ షాక్

సోద‌రుడిపై 5 ఏళ్ల పాటు స‌స్పెన్ష‌న్

Hello Telugu - MLA Anirudh Reddy Brother Shocking

Hello Telugu - MLA Anirudh Reddy Brother Shocking

MLA Anirudh Reddy : మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా : మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే జ‌నంప‌ల్లి అనిరుధ్ రెడ్డికి (MLA Anirudh Reddy) కోలుకోలేని షాక్ తగిలింది. స‌ర్కార్ పై , పార్టీపై అస‌మ్మ‌తి రాగం వినిపిస్తూ వ‌చ్చారు. ఈ మ‌ధ్య‌నే బెంగ‌ళూరు వెళ్లాడు. ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ తో క‌లిసి ఫిర్యాదు చేసిన‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఇదిలా ఉండ‌గా త‌న సోద‌రుడు దుష్యంత్ రెడ్డిపై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ మేర‌కు స్వంత పార్టీకి చెందిన మండ‌ల పార్టీ అధ్య‌క్షుడు ఝ‌ల‌క్ ఇచ్చాడు. ప్రెసిడెంట్ కృష్ణ‌య్య యాద‌వ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. అనిరుధ్ రెడ్డి సోద‌రుడు దుష్యంత్ రెడ్డిపై అయిదు సంవ‌త్స‌రాల పాటు వేటు వేసిన‌ట్లు పేర్కొన్నారు. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

MLA Anirudh Reddy Brother Shocking

ఇదిలా ఉండగా సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై ప‌లుమార్లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు ఎమ్మెల్యే జ‌నంప‌ల్లి అనిరుధ్ రెడ్డి. ఆయ‌న ప్ర‌స్తుత మంత్రి కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి అనుచ‌రుడిగా పేరు పొందారు. జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర‌శేఖ‌ర్ తో కూడా విభేదాలు వ‌చ్చాయి. ఇటీవ‌ల మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు అనిరుధ్ రెడ్డి. సోద‌రుడిని చంపిన వ్య‌క్తిని ఎలా చేర్చుకుంటారంటూ ప్ర‌శ్నించారు. తాము ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో సస్పెన్షన్ వేటు వేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. కాగా దుష్యంత్ రెడ్డి ప‌లు భూ వివాదాల్లో త‌ల దూర్చిన‌ట్లు రాజాపూర్ పార్టీ మండ‌ల అధ్య‌క్షుడు కృష్ణ‌య్య యాద‌వ్ ఆరోప‌ణ‌లు చేశారు.

Also Read : Mantha Cyclone Sensational in AP : ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు త‌ప్ప‌ని ముప్పు

Exit mobile version