ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిన మిచెల్ మార్ష్

111 ర‌న్స్ 9 ఫోర్లు 9 సిక్స‌ర్ల‌తో రికార్డ్ సెంచ‌రీ

hellotelugu-MitchelMarsh

ల‌క్నో : ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు కోలుకోలేని దెబ్బ కొట్టింది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్. ఆ జ‌ట్టుకు వ‌రుస‌గా ఆరు మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలు కాగా ఏడో మ్యాచ్ లో ఓదార్పు విజ‌యం ల‌భించింది. ఓ వైపు వ‌ర్షం అడ్డంకిగా నిల‌వ‌డంతో ఇరు జ‌ట్లు కొంత గాబ‌రా ప‌డ్డాయి. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా బ్యాటింగ్ కు దిగింది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్. మైదానంలోకి వ‌చ్చీ రావడంతోనే ఆ జ‌ట్టుకు చెందిన స్టార్ ప్లేయ‌ర్ మిచెల్ మార్ష్ పూన‌కం వ‌చ్చిన వాడిలాగా రెచ్చి పోయాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఆర్సీబీ ఔల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో దుమ్ము దులిపాడు. త‌నను అవుట్ చేసేందుకు నానా తంటాలు ప‌డ్డారు ఆర్సీబీ బౌల‌ర్లు.

అయినా ఫ‌లితం లేకుండా పోయింది. ప‌వ‌ర్ ప్లే లో భారీ ఎత్తున ప‌రుగులు రాబ‌ట్టారు బ్యాట‌ర్లు. మిచెల్ మార్చ్ కేవ‌లం 56 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని సూప‌ర్ సెంచ‌రీ చేశాడు. ఇందులో 9 ఫోర్లు 9 సిక్స‌ర్లు ఉన్నాయి. త‌న‌కు తోడుగా నికోల‌స్ పూర్ 38 ర‌న్స్ చేస్తే రిషబ్ పంత్ 10 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 2 సిక్స్ ల‌తో 38 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. వ‌ర్షం కార‌ణంగా అంపైర్లు 19. 2 ఓవ‌ర్ల‌కు మ్యాచ్ ను కుదించారు. అనంత‌రం బ‌రిలోకి దిగిన ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 209 ప‌రుగులు చేసింది. కెప్టెన్ ర‌జిత్ పాటిదార్ అద్భుతంగా ఆడాడు . త‌ను 61 రన్స్ చేశాడు. కానీ ఫ‌లితం లేకుండా పోయింది. 9 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది.

Exit mobile version