Mirai Sensational Collections : అమెరికాలో మిరాయ్ క‌లెక్ష‌న్స్ అదుర్స్

దుమ్ము రేపుతున్న తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని

Hello Telugu - Mirai Sensational Collections

Hello Telugu - Mirai Sensational Collections

Mirai : అమెరికా : టీజీ విశ్వ ప్ర‌సాద్ , టీజీ కృతి ప్ర‌సాద్ ల సంయుక్త నిర్మాణంలో నిర్మించిన చిత్రం మిరాయ్ (Mirai). కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శక‌త్వం వ‌హించాడు ఈ సినిమాకు. ఇందులో హ‌నుమాన్ మూవీ స్టార్ హీరో తేజ స‌జ్జ మ‌రోసారి దుమ్ము రేపాడు. త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. ఇక కొత్త అమ్మాయి రితికా నాయ‌క్ కెవ్వు కేక అనిపించేలా చేసింది. ఇక వీరితో పాటు విల‌న్ గా మంచు మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ కీలక పాత్ర పోషించాడు. త‌ను తొలిసారిగా ఇందులో విల‌న్ గా నటించాడు. తేజ‌తో పాటు మ‌నోజ్ కు వంద శాతం మార్కులు ప‌డ్డాయి. ఇద్ద‌రూ పోటీ ప‌డి న‌టించారు. ఈ చిత్రం ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో భారీ క‌లెక్ష‌న్స్ సాధించింది. ఇప్ప‌టికే రూ. 100 కోట్లు దాట‌డం విశేషం. ఇదే స‌మ‌యంలో ర‌వితేజ‌తో నిర్మాత తీసిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ఆశించిన మేర ఆడ‌లేదు.

Mirai Huge Collections in America

దీంతో కొంత నిరాశ‌కు గురైన టీజీ విశ్వ‌ప్ర‌సాద్ తో పాటు త‌న కూతురికి మంచి ఊపును ఇచ్చేలా చేసింది మిరాయి. ఇది విడుద‌లైన తొలి షో నుంచి నేటి దాకా దూసుకు పోతోంది. బాక్సులు బ‌ద్ద‌లు కొడుతోంది. ప్ర‌ధానంగా ఈ సినిమా కోసం వాడిన వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయ‌నే టాక్ వ‌చ్చింది. మొత్తంగా తేజ స‌జ్జా కు ఇది మ‌రింత బ‌లాన్ని ఇచ్చేలా చేసింది. ఇక ఓవ‌ర్సీస్ లో కూడా మిరాయ్ వారెవ్వా అనేలా న‌డుస్తోంది. ఇప్ప‌టికే 2. 5 మిలియ‌న్ డాలర్ల‌ను కొల్ల‌గొట్ట‌డం విశేషం. మాంచి ఊపు మీద ఉన్న నిర్మాత త‌న టీంతో క‌లిసి స‌క్సెస్ మీట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. ఇందులో కీ రోల్స్ పోషించిన వాళ్ల‌కు మంచి కార్లు గిఫ్టుగా ఇస్తాన‌ని వెల్ల‌డించాడు. మొత్తంగా మిరాయా మ‌జాకా అంటున్నారు ఫ్యాన్స్.

 

Also Read : Hero Tom Holland Injured : స్పైడ‌ర్ మ్యాన్ హీరో టామ్ హాలండ్ కు గాయాలు

Exit mobile version