Mirai : కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, రితికా నాయక్, జగపతి బాబు, శ్రియా శరణ్, మంచు మనోజ్ కీలక పాత్రల్లో పోషించిన చిత్రం మిరాయ్ దుమ్ము రేపుతోంది. విడుదలైనప్పటి నుంచి నేటి దాకా దూసుకు పోతోంది. బాక్సులను బద్దలు కొడుతోంది. అంచనాలకు మించి కాసులు కురిపిస్తోంది. కేవలం 2 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ. 55.60 కోట్లను కొల్లగొట్టింది. ఇదంతా గ్రాస్ కావడం విశేషం. మిరాయ్ (Mirai) అద్భుతమైన ప్రారంభ వారాంతపు ట్రెండ్‌తో ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ఫాంటసీ అడ్వెంచర్ ఇప్పటికే చరిత్ర సృష్టించింది. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కు సంతోషాన్ని కలిగించేలా చేసింది.
Mirai Movie Success
మిరాయ్ చిత్రం ప్రారంభ రోజున రూ. 27.20 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసింది, కానీ 2వ రోజు కలెక్షన్లు మరింత బలంగా ఉండటం ముఖ్యాంశాల్లోకి ఎక్కుతోంది. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది పాజిటివ్ టాక్ . మౌత్ టాక్ కూడా సానుకూలంగా ఉండడంతో మూవీని చూసేందుకు ఫ్యాన్స్ బారులు తీరుతున్నారు. గతంలో తేజ సజ్జా హనుమాన్ మూవీలో నటించాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పెరుగుతున్న ఊపును రుజువు చేస్తోంది. ఆదివారం బుకింగ్‌లు అద్భుతమైన బలాన్ని చూపడంతో, ట్రేడ్ విశ్లేషకులు రాబోయే బ్లాక్‌బస్టర్ వారాంతం వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఓవర్సీస్ మార్కెట్ కూడా మిరాయ్‌ను పెద్ద ఎత్తున స్వీకరించింది. యునైటెడ్ స్టేట్స్‌లో ఈ చిత్రం రెండు రోజుల్లోనే $1 మిలియన్ బెంచ్ మార్క్‌ను దాటింది . ఇప్పుడు $2 మిలియన్లను చేరుకునే దిశగా సాగుతోంది.
Also Read : Popular Actor Brahmanandam : రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు
