Brahmanandam : హైదరాబాద్ : ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మకథ ఆవిష్కరణ సందర్బంగా ఆయన తన మనసులోని మాటలను బయట పెట్టాడు. చాలా మంది తాను రాజకీయాలలోకి వస్తున్నానని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని, కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, ఆ ఆలోచనే తనకు లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా అలా ప్రచారం చేసినా వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నానని పేర్కొన్నారు. తన శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు కళామతల్లి సేవలోనే నిమగ్నం అవుతానని చెప్పారు బ్రహ్మానందం. తన ఆలోచనలకు, తన వ్యక్తిత్వానికి , తన లైఫ్ స్టైల్ కు పాలిటిక్స్ కు సరిపోవని పేర్కొన్నారు.
Brahmanandam Comments
జీవితం తనకు ఎన్నో నేర్పిందని, ఈ ప్రయాణంలో సినిమా రంగం అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు. పేద కుటుంబం వచ్చిన తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఆ తర్వాత చదువుకుని లెక్చరర్ గా పని చేశానని కానీ ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల తాను నటుడిని అయినట్లు చెప్పారు. ఆత్మకథ ఆవిష్కరణ సందర్భంగా నటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. . సినీ ప్రముఖులు, సాహిత్య ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు ఈ గొప్ప కార్యక్రమానికి హాజరయ్యారు. పేద కుటుంబంలో ఆయన నిరాడంబరమైన ప్రారంభం నుండి భారతీయ సినిమా అత్యంత ప్రసిద్ధ హాస్య నటులలో ఒకరిగా మారడం వరకు, 1,200 కంటే ఎక్కువ చిత్రాలతో నటించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం వరకు బ్రహ్మానందం అసాధారణ ప్రయాణాన్ని ఈ పుస్తకం సంగ్రహిస్తుంది.
Also Read : TTD EO Shocking Inspection : తిరుమలలో ఈవో ఆకస్మిక తనిఖీలు
