Minister Vivek Shocking Comments : న‌న్ను కావాల‌ని టార్గెట్ చేశారు : వివేక్

మాల‌ల ఐక్య స‌ద‌స్సులో షాకింగ్ కామెంట్స్

Hello Telugu - Minister Vivek Shocking Comments

Hello Telugu - Minister Vivek Shocking Comments

Minister Vivek : నిజామాబాద్ జిల్లా : మంత్రి వివేక్ వెంక‌ట స్వామి (Minister Vivek) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆదివారం నిజామాబాద్ లో మాల‌ల ఐక్య స‌ద‌స్సు నిర్వ‌హంచారు. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు మంత్రి. తాను అమాయ‌కుడిన‌ని, కేవ‌లం ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించేందుకు మాత్ర‌మే రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాన‌ని చెప్పారు. కానీ త‌న ఎదుగుద‌ల‌ను చూసి ఓర్వలేక వ్య‌క్తిగ‌తంగా డ్యామేజ్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌ధానంగా త‌న‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసుకుని నిరాధార‌మైన కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు వివేక్ వెంక‌ట‌స్వామి. అయితే మంత్రిగా తాను ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కులం ఆధారంగా కుట్రలకు తెర లేపార‌ని, విమ‌ర్శ‌ల‌కు తావిచ్చారంటూ వాపోయారు.

Minister Vivek Shocking Comments

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల చోటు చేసుకున్న ఆరోప‌ణ‌ల ప‌ర్వంపై కూడా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు వివేక్ వెంక‌ట‌స్వామి. మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ని త‌న‌పై రెచ్చ‌గొట్టేలా చేశార‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. జూబ్లీ హిల్స్ లో పార్టీ గెలిస్తే నాకు మంచిపేరు వస్తుందని విమర్శలు చేసున్నారంటూ మండిప‌డ్డారు. లక్ష్మణ్ నా పై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేద‌న్నారు. లక్ష్మణ్ వచ్చినపుడు నేను వెళ్ళిపోతున్నాను అనటం అబద్ధం అన్నారు. తాను మాల జాతికి చెందిన వ్య‌క్తినంటూ స్వ‌యంగా మంత్రి కామెంట్ చేయ‌డం త‌న‌ను బాధ పెట్టింద‌న్నారు వివేక్ వెంక‌ట‌స్వామి.

Also Read : KTR Fired on Congress : కారు కావాలా బుల్డోజ‌ర్ కావాలా తేల్చుకోండి

Exit mobile version