KTR Fired on Congress : కారు కావాలా బుల్డోజ‌ర్ కావాలా తేల్చుకోండి

కాంగ్రెస్ స‌ర్కార్ తీరుపై కేటీఆర్ కామెంట్స్

Hello Telugu - KTR Fired on Congress

Hello Telugu - KTR Fired on Congress

KTR : హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ స‌ర్కార్ నిర్వాకంపై మండిప‌డ్డారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ (KTR) సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని షేక్‌పేట్ డివిజన్‌కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు చెర్క మహేష్‌తో పాటు ప‌లువురు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా, బుల్డోజర్ కావాలా నిర్ణయించు కోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంద‌న్నారు కేటీఆర్. ప్ర‌త్య‌ర్థి పార్టీ ఎన్నో ప్ర‌లోభాల‌కు గురి చేసే ప్ర‌మాదం ఉంద‌న్నారు. అందుకే జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు.

KTR Slams Congress

కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాల‌ని డిమాండ్ చేశారు కేటీఆర్. ఈ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పితేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వ‌స్తుంద‌ని, లేక పోతే రెచ్చి పోయే ప్ర‌మాదం నెల‌కొంటుంద‌న్నారు . రెండు సంవత్సరాల్లో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్ లో ఖర్చుపెడతారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ. 10,000 ఇస్తున్న‌ట్లు త‌న‌కు తెలిసింద‌న్నారు.

Also Read : Minister Savitha Interesting Update on BC : రాష్ట్ర వ్యాప్తంగా ఎంజేపీ గురుకులాలు ఏర్పాటు

Exit mobile version