Veeranjaneya Swamy : అమరావతి : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు చాలా అవసరమని స్పష్టం చేశారు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి (Veeranjaneya Swamy). రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ హాస్టళ్ల విద్యార్థులు, డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాల విద్యార్థుల్ని క్రీడల్లో ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని శాప్ చైర్మన్ రవి నాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, డా.బి. ఆర్ అంబేద్కర్ గురుకులాల్లో క్రీడా వసతుల కల్పనకు ఎస్సీ కాంపోనెంట్ నిధులు కేటాయించాలని రవి నాయుడు మంత్రిని ఈ సందర్బంగా కోరారు.
Minister Veeranjaneya Swamy Key Comments on Sports
ఇందుకు సంబంధించి శాప్ చైర్మన్ చేసిన ప్రతిపాదనలకు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సానుకూలంగా స్పందించారు..మన విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని, వారికి ఆసక్తి ఉన్న రంగాన్ని గుర్తించి సానబడితే ప్రయోజకులవుతారని అన్నారు. విద్యార్థులకు క్రీడలు ఎంతో ఉపశమనం కలిగిస్తూ మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయని చెప్పారు మంత్రి. విద్యార్థుల్లో ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వారిని అన్ని విధాల ప్రోత్సహిస్తామని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
సమర్థవంతమైన నాయకుడైన సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి సర్కార్ అన్ని రంగాలకు సమ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రధానంగా ఏపీని క్రీడా రంగానికి కేరాఫ్ గా మార్చాలని కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. అంతే కాకుండా దివ్యాంగ విద్యార్థులకు క్రీడల్లో ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తమ వాటాగా నిధులు ఇస్తుందని అన్నారు. ఆ నిధులను శాప్ ఉపయోగించు కోవాలని మంత్రి స్వామి శాప్ చైర్మన్ రవి నాయుడుకి సూచించారు.
Also Read : Jajula Srinivas Goud Effective Comments : ఉప రాష్ట్రపతి పదవి బీసీలకు ఇవ్వాలి – జాజుల
