Jajula Srinivas Goud : హైదరాబాద్ – బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఉప రాష్ట్రపతిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బండారు దత్తాత్రేయను లేదా తమిళి సై సౌందర రాజన్ ను నియమించాలని కోరారు. ఈ మేరకు ఆయన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి సుదీర్ఘ లేఖ రాశారు. భారత రాష్ట్రపతిగా తొలిసారి ఆదివాసి మహిళకు అవకాశం కల్పించినట్లు గానే భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి బీసీ వర్గానికి చెందిన బండారు దత్తాత్రేయను లేదా బీసీ మహిళ కోటా నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై కి అవకాశం కల్పించాలని విన్నవించారు.
Jajula Srinivas Goud Key Comments..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ముగ్గురు గవర్నర్లకు అవకాశం కల్పిస్తే అందులో అందరూ అగ్ర కులాలకు సంబంధించిన వారే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud). బిజెపి పార్టీ అగ్ర కులాలకే ఎక్కువగా అవకాశం ఇవ్వడం దారుణమన్నారు. పైకేమో బీసీల జపం చేస్తూ లోపట మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించు కోవాలని ఆయన కోరారు
గతంలో రాష్ట్రపతులుగా, ఉప రాష్ట్రపతులుగా బీసీలకు అవకాశం రాలేదని, మొదటిసారి ఉప రాష్ట్రపతిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన జనదేవ్ దవ్కర్ కొరకు అవకాశం వస్తే వారి పదవి కాలం పూర్తికాక ముందే పదవి నుండి రాజీనామా చేయించారని, బీసీలకే మిగతా సమయం కల్పించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
Also Read : AP Heavy Rains Sensational : అల్ప పీడనం ప్రభావం జర భద్రం – ఐఎండీ
