KTR : హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు మెదక్ కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఇతర నాయకులు. ఈ సందర్బంగా కేటీఆర్ (KTR) ప్రసంగించారు. మెదక్‌లో ఇంకా కొన్ని గాడిదలు ఉన్నాయని, వాటి సంగతిని బీఆర్ఎస్ కార్యకర్తలు చూసుకుంటారని అన్నారు. రేవంత్ రెడ్డికి (CM Revant Reddy) కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి లాంటి లేకి ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు తాను చూడ లేదన్నారు.
KTR Write a Letter to CM Revanth Reddy
రేవంత్ రెడ్డిని గ్రామాల్లో తిడుతున్న తిట్లు ఇప్పటి దాకా చరిత్రలో ఏ ముఖ్యమంత్రిని తిట్ట లేదన్నారు.
సిగ్గు శరం ఉన్నోడు అయితే ఈపాటికి బకెట్ నీళ్లలో మునిగి ఆత్మహత్య చేసుకునే వాడన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డికి సిగ్గు,శరం, మానం, ఇజ్జత్ లేదు కాబట్టే పట్టించు కోవడం లేదన్నారు. రెండు లక్షల రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పి అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ప్లేటు ఫిరాయించాడని ఆరోపించారు. 50 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రూ. 12 వేల కోట్లకు మాత్రమే పరిమితం చేశాడని, కానీ మొత్తం రుణమాఫీ చేశానని గప్పాలు కొట్టుకోవడం దారుణమన్నారు.
అత్తకు నెలకు రూ. 4,000, కోడలికి నెలకు రూ. 2,500 ఇస్తానన్నాడని మాట మరిచి పోయాడంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పుడు 100 సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్నాడని, అందుకే వంద కాదు వాని బొంద అన్నానని అన్నారు కేటీఆర్ . తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చునే భాగ్యం రేవంత్ రెడ్డికి రావడానికి కారణం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్, బీఆర్ఎస్ లేకపోతే గులాబీ జెండా ఎగరకపోతే ఇవాళ తెలంగాణ వచ్చేదా అని నిలదీశారు. హరీష్ రావు దగ్గర రేవంత్ రెడ్డి శిష్యరికం చేసిండు. హరీష్ రావు మంత్రి అయినప్పుడు ఇదే తెలంగాణ భవన్ ముందు రేవంత్ డాన్సులు కూడా చేశాడని గుర్తు చేశారు.
Also Read : Nara Lokesh Shocking Comments : పరామర్శించేందుకు వచ్చి ప్రాణాలు తీశాడు – లోకేష్
