Popular Actor Fish Venkat : న‌టుడు ఫిష్ వెంక‌ట్ ఆస్ప‌త్రి ఖ‌ర్చుల‌న్నీ భ‌రిస్తాం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి

Hello Telugu - Popular Actor Fish Venkat

Hello Telugu - Popular Actor Fish Venkat

Fish Venkat : హైద‌రాబాద్ – తీవ్ర అనారోగ్యంతో చావు బ‌తుకుల్లో ఉన్న న‌టుడు ఫిష్ వెంక‌ట్ ను ప‌రామ‌ర్శించారు రాష్ట్ర బీసీ, క్రీడా, మ‌త్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి. సోమ‌వారం త‌న ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకున్న వెంట‌నే హుటా హుటిన హైద‌రాబాద్ లోని ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న న‌టుడిని ప‌రామ‌ర్శించారు. ఎలాంటి ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని భ‌రోసా ఇచ్చారు. ఎంత ఖ‌ర్చు అయినా ప‌ర్వాలేదని, దానిని పూర్తిగా ప్ర‌తి పైసాను రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. ఫిష్ వెంక‌ట్ మ‌త్స్య కుటుంబం నుంచి వ‌చ్చాడు. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హాష్య న‌టుడిగా పేరు పొందాడు. ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌లో అతిథి పాత్ర‌ల‌ను పోషించాడు.

Minister Vakiti Srihari – Fish Venkat

న‌టుడు ఫిష్ వెంక‌ట్ (Fish Venkat) ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి మీడియాతో మాట్లాడారు. త‌న కుటుంబం ఎలాంటి ఆందోళ‌న‌కు గురి కావాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌భుత్వం అన్ని ఖ‌ర్చుల‌ను భ‌రించేందుకు సిద్దంగా ఉంద‌న్నారు. ఈ విష‌యాన్ని ప్రైవేట్ ఆస్ప‌త్రి యాజ‌మాన్యానికి కూడా తెలియ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. సినీ న‌టుడు ప్ర‌భాస్ పేరుతో ఫోన్ చేసిన విష‌యం త‌న‌కు తెలియ‌ద‌న్నారు. ఎవ‌రు సాయం చేస్తార‌న్న‌ది ముఖ్యం కాద‌ని, త‌ను జీవించి ఉండ‌డం, ఆరోగ్యంగా ఉండ‌డం ప్ర‌ధాన‌మ‌ని స్ప‌ష్టం చేశారు వాకిటి శ్రీ‌హ‌రి. ఇదిలా ఉండ‌గా ఓ కిడ్నీ చెడి పోయింద‌ని, ఎవ‌రైనా దాత ఉంటే తాను సాయం చేస్తానంటూ ప్ర‌భాస్ చెప్పారంటూ ఫిష్ వెంక‌ట్ కూతురు తెలిపింది.

ఆ త‌ర్వాత ఈ విష‌యం సంచ‌ల‌నంగా మారింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాస్ త‌ర‌పు నుంచి ఎలాంటి సాయం కూడా అంద‌లేద‌ని వాపోయింది. ఈ మొత్తం వ్య‌వ‌హారం ప‌క్క‌న పెడితే మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి స్పందించ‌డం, భ‌రోసా ఇవ్వ‌డంతో కుటుంబం త‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలిపింది. మంత్రి వెంట‌ ఫిష‌రీష్ చైర్మ‌న్ మెట్టు సాయి కుమార్, స్పోర్స్ చైర్మ‌న్ శివ సేనా రెడ్డి ఉన్నారు. ఈ సంద‌ర్బంగా త‌న త‌ర‌పున రూ. ల‌క్ష సాయం అందించారు.

Also Read : Hero Mahesh Babu : మ‌హేష్ బాబుకు కన్స్యూమ‌ర్స్ క‌మిష‌న్ నోటీస్

Exit mobile version