Mahesh Babu : ప్రముఖ టాలీవుడ్ నటుడు మహేష్ బాబు ఘట్టమనేనికి కోలుకోలేని షాక్ తగిలింది. ఊహించని రీతిలో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల హక్కుల కమిషన్ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్నారని, ఆ సంస్థ మోసం చేసిందంటూ ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఆపై కోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ లో కేసు కూడా నమోదైంది. తాజాగా కన్స్యూమర్స్ కమిషన్ కూడా సీరియస్ అయ్యింది. ఈ వ్యవహారంపై సదరు సంస్థతో పాటు దానిని విస్తృతంగా ప్రచారం చేపట్టిన ప్రిన్స్ మహేష్ బాబుకు (Mahesh Babu) కూడా నోటీసులు జారీ చేసింది.
Mahesh Babu Gets Notices
మరో వైపు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సైతం కోలుకోలేని ఝలక్ ఇచ్చింది. విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో మహేష్ బాబు ను మూడో ప్రతివాదిగా చేర్చారు. బాలాపూర్‌లో ఒక ప్లాట్ కొనుగోలు చేసినందుకు తమను రూ.34.8 లక్షలు మోసం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. లేఅవుట్ లేకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని వారు కమిషన్‌ను ఆశ్రయించారు.
సాయి సూర్య డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు మహేష్ బాబు. బాధితులు తమకు న్యాయం చేయాలని, తాము మోసానికి గురైన చెల్లించిన డబ్బులను తిరిగి ఇప్పించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కమిషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటి వరకు మహేష్ బాబు ఈడీ ముందు విచారణకు హాజరు కాలేదు. తాను షూటింగ్ లో బిజీగా ఉన్నానని తర్వాత హాజరవుతానని తెలిపాడు.
Also Read : Rohan Thakkar – Anshula Love Marriage : రోహన్ థక్కర్ తో అన్షులా కపూర్ నిశ్చితార్థం
