నంది అవార్డుల పున‌రుద్ద‌ర‌ణ‌కు ఏపీ స‌ర్కార్ ఓకే

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు థ్యాంక్స్

hellotelugu-APGovt

అమ‌రావ‌తి : నంది అవార్డుల పునరుద్ధరణకు ఏపీ స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. 1964లో ప్రారంభమైన నంది చలనచిత్ర అవార్డులు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, తెలుగు ప్రజల సంస్కృతికి ఎంతో భావోద్వేగంతో కూడిన అంశం. 2017-2024 సంవత్సరాలకు నిలిచి పోయిన ‘నంది చలనచిత్ర అవార్డుల’ను పునరుద్ధరించినందుకు గాను సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కె. దుర్గేష్, హిందూపురం ఎమ్మెల్యే , ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ఏపీ రాష్ట్ర చలనచిత్ర, టీవీ , థియేటర్ అభివృద్ధి సంస్థ చైర్మన్ పి. భరత్ భూషణ్, ఎండీ కె.ఎస్. విశ్వనాథన్ లకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తమ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

అలాగే 24 సెప్టెంబ‌ర్ నాటి లేఖ ద్వారా ఏపీ ఎఫ్‌డిసి ప్రభుత్వానికి సమర్పించిన అభ్యర్థనను పరిశీలించింది. బంగారు నంది, వెండి నంది, కాంస్య నంది అనే మూడు విభాగాలలో నంది అవార్డులను పునరుద్ధరించడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 2017-2024 సంవత్సరాలకు ‘ఎన్.టి.ఆర్. జాతీయ చలనచిత్ర అవార్డు’ పునరుద్ధరణను పరిశీలిస్తున్నందుకు కూడా వారు కృతజ్ఞతలు తెలియ జేశారు. 1964లో ప్రారంభమైంది. నంది చలనచిత్ర అవార్డుల ద్వారా కళాకారులు , సాంకేతిక నిపుణులను గౌరవించడాన్ని స్వాగ‌తిస్తున్నారు. అందువల్ల, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణులను గౌరవించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం / కూటమి పార్టీలను తాము హృదయ పూర్వకంగా కోరుతున్నట్లు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి పేర్కొంది.

Exit mobile version