తెలంగాణ స‌మ్మిట్ కోసం సీఎం స్టాలిన్ కు ఆహ్వానం

మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసిన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

hellotelugu-UttamKumarReddy

చెన్నై : రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మ‌ర్యాద పూర్వ‌కంగా చెనైలోని సీఎం కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ ను క‌లిశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. త‌మ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా హైద‌రాబాద్ లో ఈనెల 8,9వ తేదీల‌లో రెండు రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ 2025ని నిర్వ‌హిస్తోంద‌ని చెప్పారు. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన సంస్థ‌లు, కంపెనీలు, సీఈఓలు, చైర్మ‌న్లు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లు, క‌న్స‌ల్టెంట్స్, టెక్ దిగ్గ‌జాలు, నిపుణులు, ఆంట్ర‌ప్రెన్యూర్ లు 5 వేల మందికి పైగా హాజ‌ర‌వుతార‌ని తెలిపారు.

ఈ సంద‌ర్బంగా ఇప్ప‌టికే దేశ రాష్ట్ర‌ప‌తి ముర్ము, ప్ర‌ధాన‌మంత్రి మోదీ, కేంద్ర మంత్రుల‌తో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను రావాల‌ని కోరామ‌ని తెలిపారు ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సీఎం స్టాలిన్ తో. రాష్ట్ర స‌ర్కార్ త‌ర‌పున అధికారికంగా ఆహ్వాన ప‌త్రిక‌ను అంద‌జేశారు. మంత్రిని స్టాలిన్ స‌న్మానించారు. త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఇదిలా ఉండ‌గా స‌ర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కాగా స‌మ్మిట్ కు సంబంధించి ఈనెల 10 నుంచి 13వ తేదీ వ‌ర‌కు ఉచితంగా ప్ర‌జ‌లు సంద‌ర్శించేలా ఏర్పాట్లు చేసింది. ఈ స‌మ్మిట్ ద్వారా భారీ ఎత్తున పెట్టుబ‌డులు ఆక‌ర్షించాల‌ని స‌ర్కార్ భావిస్తోంది.

Exit mobile version