గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి స‌హ‌క‌రించాలి

49వ రాష్ట్ర స్థాయి బ్యాంక‌ర్ల కమిటీ మీటింగ్ లో తుమ్మ‌ల‌

hellotelugu-TummalaNageshwarRao

హైద‌రాబాద్ : తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకులు మరింత చురుకైన పాత్ర పోషించాలని రాష్ట్రంలోని బ్యాంకుల‌ను కోరారు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు . శుక్ర‌వారం ప్రజాభవన్‌లో నిర్వహించిన 49వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) త్రైమాసిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకింగ్ సంస్థల ప్రతినిధులు, NABARD అధికారులు, సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రతినిధలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా మంత్రి ప్ర‌సంగించారు. .

తెలంగాణ రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరాంతానికి మొత్తం డిపాజిట్లు సుమారు రూ.9.43 లక్షల కోట్లకు, మొత్తం అడ్వాన్సులు రూ.12.33 లక్షల కోట్లకు చేరాయని, రాష్ట్ర క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 130.78 శాతంగా నమోదై జాతీయ సగటును మించి ఉందని మంత్రి తెలిపారు. ప్రధాన రంగ రుణాలు రూ.4.09 లక్షల కోట్లు, వ్యవసాయ రుణాలు రూ.1.87 లక్షల కోట్లకు చేరడం సంతోషకరమని పేర్కొన్నారు. వ్యవసాయ రుణాల లక్ష్య సాధన 102 శాతం నమోదు కావడం అభినందనీయమని అన్నారు.

2025-26 ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల పంపిణీ రూ.75,486 కోట్లకు చేరి, వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంలో 84.34 శాతం సాధించిందని, మొత్తం వ్యవసాయ, అనుబంధ రంగాలు, మౌలిక వసతుల కింద రూ.1,68,401 కోట్ల రుణాలు పంపిణీ చేసి 101.88 శాతం లక్ష్య సాధన నమోదు కావడం రాష్ట్ర బ్యాంకింగ్ వ్యవస్థ పురోగతిని సూచిస్తోందని మంత్రి తెలిపారు. కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, TGCAB వంటి బ్యాంకులు లక్ష్యాలను మించి రుణాల పంపిణీ చేయగా, మరికొన్ని బ్యాంకులు తమ పనితీరును మెరుగు పరచాల్సిన అవసరం ఉందన్నారు.

అయితే ఇప్పటికీ వ్యవసాయ రుణాలలో అధిక భాగం స్వల్పకాలిక పంట రుణాలకే పరిమితమవడం ఆందోళన కలిగించే విషయమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయం ఇప్పుడు ఉద్యానవనం, ఆయిల్ పామ్, సమగ్ర వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షిత సాగు, పాడి, మత్స్య, యాంత్రీకరణ వంటి రంగాల వైపు వేగంగా మారుతున్న నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ కూడా మారుతున్న అవసరాలకు అనుగుణంగా స్పందించాలని కోరారు. గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, ప్యాక్ హౌస్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, డ్రిప్ ఇరిగేషన్, సోలార్ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ వంటి రంగాలకు దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు అందించాలని సూచించారు.

Exit mobile version