DY CM Bhatti Vikramarka Important Update : తెలంగాణ రైజింగ్ ఉత్స‌వాల్లో భాగ‌స్వాములు కావాలి

పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క‌

Hello Telugu - DY CM Bhatti Vikramarka Important Update

Hello Telugu - DY CM Bhatti Vikramarka Important Update

Bhatti Vikramarka : హైద‌రాబాద్ : ఉప ముఖ్యమంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా వ‌చ్చే నెల డిసెంబ‌ర్ లో 2047 తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 8, 9 తేదీల్లో నిర్వహించనున్న రైజింగ్ ఉత్స‌వాల‌లో అన్ని రకాల పాలసీలను ప్రకటిస్తామని చెప్పారు. ఈ భారీ కార్యక్రమంలో బ్యాంకర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఈరోజు ఆయన బేగంపేటలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన బ్యాంకర్స్ 47వ త్రైమాసిక సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

DY CM Bhatti Vikramarka Invites

మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా 13 శాతం జీడీపీ పెరుగుదల టార్గెట్ గా 2047 రోడ్ మ్యాప్ ను విడుదల చేయబోతున్నట్లు డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి సంవత్సరం 10 శాతం చొప్పున పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన విద్యుత్తు సరఫరా లక్ష్యాన్ని సాధిస్తామని స్పష్టం చేశారు. మొదటి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసిందో వివరించామ‌ని తెలిపారు. రెండవ సంవత్సరం చేసిన కార్యక్రమాలు వివరించడంతో పాటు తెలంగాణ రాష్ట్రం పట్ల మా కల ఏంటి, ఆ కలను సాధించేందుకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతున్నాం అనేది తెలంగాణ రైజింగ్ ఉత్సవాల‌లో వివరించ బోతున్నామని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం.

Also Read : Nerella Sharada Important Update : కావాల‌నే మహిళా జర్నలిస్టులపై అసభ్యకర పోస్టులు

Exit mobile version