Minister Seethakka Fired on KTR : కేటీఆర్..సీఎం ర‌మేష్ ఇంటికి వెళ్లావా లేదా..?

మాజీ మంత్రిపై మంత్రి సీత‌క్క కామెంట్స్

Hello Telugu - Minister Seethakka Fired on KTR

Hello Telugu - Minister Seethakka Fired on KTR

Minister Seethakka : హైద‌రాబాద్ – సీఎం రమేష్‌ ఇంటికి వెళ్లిన విషయంపై కేటీఆర్‌ ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదని ప్ర‌శ్నించారు మంత్రి సీత‌క్క‌ (Minister Seethakka). పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కు కాలేదని ఎందుకు చెప్పడం లేద‌న్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కశాతం ఓట్లు తేడా వస్తే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ ఓట్లన్నీ బీజేపీకి వెళ్లాయా లేదా అన్న‌ది చెప్పాల‌న్నారు. కేటీఆర్‌ గుండెపై చేయివేసుకొని ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగ‌ళవారం మంత్రి సీత‌క్క మీడియాతో మాట్లాడారు.

Minister Seethakka Slams KTR

అబ‌ద్దాల పునాదుల మీద బీఆర్ఎస్ బ‌తుకుతోంద‌ని ఆరోపించారు. ఇప్ప‌టికే ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ది చెప్పినా క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీకి చెందిన వారి బుద్దులు మార‌డం లేద‌న్నారు. ఎంత సేపు త‌మ మీద ఏడ్వ‌డం త‌ప్పితే ఒక బాధ్య‌తాయుత‌మైన ప్ర‌జా ప్ర‌తినిధులుగా మాట్లాడ‌క పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు సీత‌క్క‌. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, త్వ‌ర‌లోనే మ‌రోసారి బీఆర్ఎస్ నేత‌ల‌కు చుక్క‌లు చూపించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు .

ఇక‌నుంచైనా నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు మానుకోవాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని వార్నింగ్ ఇచ్చారు సీత‌క్క‌. ప‌లుమార్లు ప‌ద్ద‌తి మార్చుకోవాల‌ని సూచించామ‌ని కానీ వినిపించు కోవ‌డం లేద‌న్నారు. ఇక‌నైనా మారాల‌ని హిత‌వు ప‌లికారు. లేక పోతే బాగుండ‌ద‌న్నారు సీత‌క్క‌. బ‌ట్ట కాల్చి మీద వేయ‌డం త‌ప్పితే ఇప్ప‌టి దాకా చేసింది ఏముంద‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ పేరుతో 10 ఏళ్లు అందినంత మేర దోచుకున్నార‌ని అయినా ఇంకా ఆశ చావ‌డం లేద‌న్నారు.

Also Read : YS Jagan – New Innovation : కార్య‌క‌ర్త‌ల కోసం వైసీపీ ప్ర‌త్యేకంగా యాప్

Exit mobile version