Minister Savitha : అమరావతి : మహిళా సంక్షేమం తమ కూటమి సర్కార్ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి ఎస్. సవిత. గురువారం శాసన సభలో ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. గతంలో ఏ నాయకుడు మహిళల కోసం కృషి చేయలేదని చెప్పారు .మహిళా పక్షపాతి సీఎం నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి మహిళను పారిశ్రామిక వేత్తగా తయారు చేయాలన్నది ఆయన కల అని , దానిని సాకారం చేసేందుకు అడుగులు వేస్తున్నారని ఎస్ సవిత (Minister Savitha) చెప్పారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో మహిళల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. ఇక 2019-24 మధ్య మహిళల సంక్షేమాన్ని గాలికి వదిలి వేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.
Minister Savitha Key Comments on Women Safety
కానీ మళ్లీ సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని స్పష్టం చేశారు. మహిళలకు టైలరింగ్ శిక్షణతో పాటు కుట్టు మిషన్ కూడా ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు ఎస్. సవిత. రాష్ట్రంలో మహిళల కుట్టు శిక్షణ విజయంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు.. శిక్షణ పట్ల మహిళల్లో సంతోషం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. శిక్షణకు హాజరయ్యే మహిళలను ఫేషీయల్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) హాజరు తీసుకుంటున్నామని వెల్లడించారు. 90 రోజుల పాటు టైలరింగ్ శిక్షణ అందజేస్తున్నామని చెప్పారు ఎస్. సవిత. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్ ఉచితంగా ఇవ్వడమే కాకుండా సర్టిఫికెట్ కూడా ఇస్తున్నామని అన్నారు. గార్మెంట్ పరిశ్రమల్లో టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉపాధి లభించేలా ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో ఒప్పందాలు చేసుకుంటున్నామని ప్రకటించారు.
Also Read : CM Chandrababu – TTD Growth : తిరుమల పవిత్రత పరిరక్షణకు ప్రాధాన్యం
