Minister Savitha Interesting Comments : ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ సాధించి తీరుతాం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్ర‌క‌ట‌న

Hello Telugu - Minister Savitha Interesting Comments

Hello Telugu - Minister Savitha Interesting Comments

Minister Savitha : అమరావతి : అనంతపురంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఫారిన్ కంట్రి బ్యూషన్ రెగ్యూలేషన్ యాక్ట్ (ఎఫ్ సీఆర్ఏ) రెన్యువల్ ను సాధించి తీరుతామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత (Minister Savitha) స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నాలుగో రోజు మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎంఎస్ రాజు, పల్లె సింధూర రెడ్డి, అమిలినేని సురేంద్ర బాబు, దగ్గుపాటి ప్రసాద్, బండారు శ్రావణితో కలిసి మంత్రి సవిత మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధిలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి సవిత తెలిపారు. వందేళ్ల నుంచి రాయలసీమ సహా ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్య, వైద్య, మౌళిక సదుపాయాల కల్పనకు ఆర్డీటీ సంస్థ ఎంతో కృషి చేస్తోందన్నారు.

Minister Savitha Comments

ఆ సంస్థ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యూలేషన్ యాక్ట్ (ఎఫ్ సీఆర్ఏ) రెన్యువల్ పునరుద్ధరణకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు సమిష్టిగా కృషి చేస్తున్నామన్నారు. ఇదే విషయమై ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులను కలిశామన్నారు. ఆర్డీటీ ఫారిన్ కంట్రి బ్యూషన్ రెగ్యూలేషన్ యాక్ట్(ఎఫ్ సీఆర్ఏ) రెన్యువల్ ను పునరుద్ధరించాలని కోరామన్నారు. అసెంబ్లీ సమావేశంలో సందర్భంగా మంత్రి లోకేశ్ ను కలిశామనన్నారు. ప్రధాని నరేంద్రమోడితో మాట్లాడి ఆర్టీడీ ఫారిన్ కంట్రి బ్యూషన్ రెగ్యూలేషన్ యాక్ట్ (ఎఫ్ సీఆర్ఏ) రెన్యూవల్ చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు.

Also Read : Ex MP Vinod Fired on Minister Uttam : ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కామెంట్స్ బ‌క్వాస్

Exit mobile version