Minister Savitha : అనంతపురం జిల్లా – మంత్రి సవిత షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ సీఎం జగన్ రెడ్డిపై. పులివెందుల , ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని తనకు ముందే తెలుసన్నారు. రిగ్గింగ్ చేసే కల్చర్ ఎన్డీయే, చంద్రబాబుది కాదన్నారు. వివేకానంద రెడ్డిని ఏ విధంగా రప్ప రప్ప అంటూ నరికి చంపారో ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచామన్నారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని రాచరిక పాలన సాగించినందుకే ప్రజలు బండకేసి కొట్టారని అయినా ఇప్పటి వరకు బుద్ది రాలేదంటూ జగన్ రెడ్డిని ఉద్దేశించి మండిపడ్డారు.
Minister Savitha Slams YS Jagan
156 సీట్లు కలిగిన జగన్ రెడ్డిని, ఆయన పరివారాన్ని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని అయినా తమ కూటమి సర్కార్ పై లేనిపోని ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందన్నారు మంత్రి ఎస్. సవిత (Minister Savitha). జగన్ హయాంలో గాడి తప్పిన అన్ని వ్యవస్థలను గాడిన పెట్టేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నానా తంటాలు పడుతున్నారని చెప్పారు. ఆరు నూరైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ అష్టకష్టాలు పడి నిధులను తీసుకు వచ్చిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. ఇచ్చిన ఆరు హామీలను అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు మంత్రి.
Also Read : KTR Fired on CM : ఫ్యూచర్ సిటీ పేరుతో సీఎం కుట్ర
