KTR : హైదరాబాద్ – ఫ్యూచర్ సిటీపై మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్మాసిటీ రద్దు చేసి ఫ్యూచర్ సిటీ అంశం తెరపైకి తేవడం కుట్ర అంటూ పేర్కొన్నారు. రైతుల వద్ద ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములను ఫ్యూచర్ సిటీకి తరలించడం కుదరదని రెండేళ్ల క్రితం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని హెచ్చరించానని అన్నారు. ఆ విషయాన్ని ప్రభుత్వం ఆలస్యంగా తెలుసుకుందన్నారు. ప్రచారాల కోసం వందల కోట్లు ఖర్చు చేసి, ఫ్యూచర్ సిటీ అని రైతులను, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. పాలన మీద అవగాహన లేని సీఎం వల్ల నష్టం వాటిల్లిందన్నారు.
KTR Slams CM Revanth Reddy
సోమవారం మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రడ్డి లాంటి వారు రాష్ట్రాన్ని పరిపాలించడం వల్లనే ఇవాళ రాష్ట్ర పరిస్థితి గందరగోళంగా తయారైందన్నారు. అన్ని వ్యవస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో నాలుగున్నర కోట్ల ప్రజలను నిట్టు నిలువునా మోసం చేశారని ఫైర్ అయ్యారు కేటీఆర్. ఇప్పటి వరకు ఒక్క ఉచిత బస్సు పథకం తప్పా ఏ ఒక్క హామీని పూర్తి చేసిన పాపాన పోలేదన్నారు.
ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని నమ్మ బలికిన సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చాడని , ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని రీతిలో అపజయం తప్పదన్నారు. సీఎంకు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
Also Read : MLA Raja Singh Shocking Comments : తెలంగాణలో బీజేపీ సర్కార్ రాదు
