Minister Savitha : అనంతపురం జిల్లా – జనరంజకంగా పాలన అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పై జగన్ విషం కక్కడం మానుకోవాలని హితవు పలికారు మంత్రి సవిత (Minister Savitha). తప్పుడు రాతలు మానుకోవాలని, లేకుంటే ప్రజలు ఛీత్కారానికి గురై రాజకీయ సమాధి కావడం తథ్యమని హెచ్చరించారు. వినుకొండ పర్యటనకు వచ్చిన మంత్రి సవిత తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. అయిదేళ్ల పాలనలో జగన్ రెడ్డి (YS Jagan) సంక్షేమ హాస్టళ్లను, బీసీ బిడ్డలను తీవ్ర నిర్లక్ష్యం చేశారన్నారని ఆరోపించారు. 2019-24 మధ్య అయిదేళ్ల కాలంలో బీసీ హాస్టళ్ల నిర్మాణాలకు గాని, మరమ్మతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కనీసం విద్యుత్ బల్బు కాలిపోయినా, కుళాయి ట్యాప్ విరిగి పోయినా పట్టించు కోలేదన్నారు.
Minister Savitha Slams YS Jagan
దుప్పట్లు కూడా పంపిణీ చేయలేదన్నారు. డైట్ బిల్లులు రూ.110 కోట్లు, కాస్మెటిక్ చార్జీలు 31.02 కోట్లు, మరమ్మతులకు ఇస్తామన్న రూ.9 కోట్లు.. ఇలా రూ.150 కోట్ల మేర బీసీ హాస్టళ్ల విద్యార్థులకు జగన్ రెడ్డి బకాయిలు పెట్టారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డైట్ బిల్లులు, కాస్మొటిక్ చార్జీల సహా రూ.150 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఇవే కాకుండా, వంట పాత్రల కొనుగోలుకు రూ.18 కోట్లు, హాస్టళ్ల మరమ్మతులకు రూ.13 కోట్లు, హాస్టళ్ల వసతి గదులు నిర్మాణానికి రూ.25 కోట్లు అందజేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్ల అభివృద్ధికి రూ.40 కోట్ల సీఎస్ఆర్, డీఎంఆర్ నిధులు మంజూరు చేశామన్నారు. బీసీ హాస్టళ్లలో ఎస్సార్ శంకరన్ సెంటర్లు, సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు, ఆర్వో ప్లాంట్ లు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు.
ఇప్పటికే బీసీ హాస్టళ్ల విద్యార్థులకు లక్షకు పైగా దుప్పట్లు అందజేశామన్నారు మంత్రి సవిత. ఈ నెలాఖరులోగా అందరికీ దుప్పట్లు పంపిణీ చేస్తామన్నారు. ఎంజేపీ స్కూళ్ల అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేశామన్నారు. కంప్యూటర్ ల్యాబ్ లు ఏర్పాటు చేశామన్నారు. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లు విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు కూడా అందజేస్తున్నామన్నారు. ఇదంతా కేవలం ఏడాది కాలంలోనే చేశామన్నారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు ఆరోగ్య భద్రత కూడా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. మేనమామనంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను జగన్ రెడ్డి మోసగించాడన్నారు. బడుగు, బలహీన వర్గాల ద్రోహి జగన్ రెడ్డి అని మండిపడ్డారు.
Also Read : KTR Strong Counter – CM Ramesh : సీఎం రమేష్ కామెంట్స్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
