KTR : హైదరాబాద్ – బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన కామెంట్స్ పై సీరియస్ గా స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. తన చెల్లెలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జైలు నుంచి విడిపించేందుకు బీజేపీ హైకమాండ్ తో మాట్లాడితే ఉన్న పళంగా బీఆర్ఎస్ ను విలీనం చేస్తానంటూ ప్రపోజల్ చేసినట్లు స్వయంగా ప్రకటించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సీఎం రమేష్ (CM Ramesh) చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.
KTR Strong Counter to MP CM Ramesh
ఈ సందర్భంగా మరోసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ లో చోటు చేసుకున్న రూ. 10,000 కోట్ల స్కాంతో పాటు ఫ్యూచర్ సిటీలో ఇచ్చిన రూ.1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ కుంభకోణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వీటికి సంబంధించి పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని చర్చించేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించారు. వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదన్నారు కేటీఆర్. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది లేదని దీని వెనుక సీఎం చంద్రబాబు నాయుడు వెనుక ఉండి నడిపిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి సీఎం రమేష్ కు మధ్య కుదిరిన రహస్య ఒప్పందం గురించి బయట పెట్టడంతో తట్టుకోలేక తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీపై మండిపడ్డారు కేటీఆర్. HCU భూములు తాకట్టు పెట్టి 10 వేల కోట్లు దోచుకున్న లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారంటూ మండిపడ్డారు. తాను ఆనాడు చెప్పింది ఈనాడు రుజువైందన్నారు. దొంగతనం బయటపడటంతో.. అటెన్షన్ డైవర్షన్ కోసం పనికి రాని కథలు చెబుతున్నారంటూ ఆరోపించారు. రూల్స్ ను బ్రేక్ చేయడం కాంట్రాక్టును అడ్డంగా అనుకున్న వాళ్లకు కట్ట బెట్టడం నీ దోస్తు రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఫైర్ అయ్యారు.
Also Read : MLC Deshapati Shocking Comments : బాబు శాసిస్తాడు బానిస పాటిస్తాడు : దేశిపతి
