Minister Savitha : విజయవాడ : తమ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో బీసీ (బహుజన) అభ్యర్థులు సత్తా చాటినట్లు మంత్రి ఎస్. సవిత (Minister Savitha) వెల్లడించారు. 246 మంది గురువులుగా ఎంపికైనట్లు తెలిపారు. బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో మెగా డీస్సీకి ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందజేశామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా నిర్వహించిన శిక్షణా కేంద్రాల్లో 1,674 మంది, ఆన్ లైన్ ద్వారా మరో 4,774 మందికి ఇలా మొత్తం 6,470 మందికి ఉచిత శిక్షణ అందజేశామన్నారు. శిక్షణ పొందిన వారిలో 241 మంది బీసీ అభ్యర్థులు టీచర్లగా ఎంపికయ్యారని చెప్పారు. టీచర్లుగా నియమితులైన వారితో పాటు బీసీ సంక్షేమ శాఖాధికారులను మంత్రి అభినందించారు. విజయవాడలోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 83 మందికి సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ అందజేయగా, వారిలో గ్రూప్ 2 మెయిన్స్ కు 12 మంది, ఆర్.ఆర్.బి లెవల్ – 1కు పది మంది ఎంపికయ్యారన్నారు.
Minister Savitha Comments
ఎఫ్.ఆర్.వో ప్రిలిమ్స్ కు ఇద్దరు, మెయిన్ కు ఒకరు అర్హత సాధించారన్నారని వెల్లడించారు. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో మరో ఆరుగురు, ఆర్.ఆర్.బి లోకో పైలట్ గా మరో అభ్యర్థి ఎంపికయ్యారన్నారు. మరికొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు మరికొందరు అర్హత సాధించారన్నారు. అత్యధిక మంది బీసీ యువత ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడడమే సీఎం చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తితో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా బీసీ యువతకు ఉచిత శిక్షణ అందజేసినందుకు బీసీ సంక్షేమ శాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించిందన్నారు. ఈ నెల 20న దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ అవార్డు అందుకోనున్నట్లు మంత్రి చెప్పారు.
Also Read : Home Minister Anitha Important Update : ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు
















