Minister Savitha : శ్రీసత్యసాయి జిల్లా : పీపీపీ మోడల్ ద్వారా కూటమి ప్రభుత్వం నిర్మించతలపెట్టిన 10 మెడికల్ కాలేజీల టెండర్లలో పాల్గొనొద్దంటూ జగన్ హెచ్చరికలు చేయడం పట్ల రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత (Minister Savitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ బెదిరింపులకు రాష్ట్రంలో భయపడే వారెవరూ లేరని, బావిలో ఎవరు పడి చావాలో ఇప్పటికే ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పారని అన్నారు. తన నీలి మీడియాలో 17 మెడికల్ కాలేజీ నిర్మించానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తనను చూసిప్రజలు నవ్వుకుంటున్నారని దెప్పి పొడిచారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్-సూపర్ హిట్ విజయోజత్సవ సభ మెగా హిట్ అయ్యిందని, ఇది చూసి ఓర్వలేక జగన్ విషం కక్కుతున్నాడని విమర్శించారు.
Minister Savitha Slams Ex CM YS Jagan
పెనుకొండలో పునాదుల దశలోనే నిలిచి పోయిన మెడికల్ కాలేజీని కూటమి నాయకులతో కలిసి మంత్రి సవిత గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. 2021 లో 17 మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నానంటూ ఆనాడు జగన్ రెడ్డి ఆర్భాటంగా గాల్లో వచ్చి శంకుస్థాపన చేశారన్నారు. రెండేళ్లలో పూర్తి చేస్తామని డబ్బా కొట్టారన్నారు. ఆయన పదవీ కాలం పూర్తయినా ఏ ఒక్క మెడికల్ కాలేజీని కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం, నాబార్డు నిధులతో మాత్రమే విజయనగరం, నంద్యాల, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం మెడికల్ కాలేజీలను అసంపూర్తి నిర్మించి, ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించేశాడని మండిపడ్డారు.
పార్వతీపురం మెడికల్ కాలేజీ నిర్మాణానికి కనీసం టెండర్ కూడా పిలవలేదన్నారు. మెడికల్ కాలేజీలు మాత్రమే కాకుండా బీసీ భవనాలు, బీసీ హస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లు, ఇతర భవనాలను సైతం నిధులున్నా కూడా పూర్తి చేయ లేదన్నారు. టీడీపీకి మంచి పేరు వస్తుందనే అసూయతో ఆ భవనాలను పట్టించు కోలేదన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చడం జగన్ కు తెలుసని, భవన నిర్మాణాలు మాత్రం చేతకాదని మంత్రి సవిత ఎద్దేవా చేశారు.
Also Read : Nepal New PM Approved : నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ ఘిసింగ్
