Minister Savitha Interesting Comments : స్త్రీ శక్తితో మహిళలకు ఆర్థిక స్వావ‌లంబ‌న‌

బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత

Hello Telugu - Minister Savitha Intreresting Comments

Hello Telugu - Minister Savitha Intreresting Comments

Minister Savitha : విజయవాడ : స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకంతో మహిళల్లో ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగిందని రాష్ట్ర బీసీ, ఈడబ్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత (Minister Savitha) అన్నారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకంపై మహిళల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విజయవాడ నుంచి అమరావతి వెళ్లే ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికులతో ప్ర‌యాణం చేశారు. ఆమె ఉండ‌వ‌ల్లి స్టేజి వ‌ద్ద దిగారు. ఈ సందర్భంగా బ‌స్సులోని మ‌హిళా ప్ర‌యాణీకుల‌తో మంత్రి ముచ్చటించారు. ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో కలిగిన లాభాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న పథకాలు గురించి వివరించారు. తల్లికి వందనం, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత ఇసుక వల్ల ఎంతో మేలు కలుగుతోందని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.

Minister Savitha Key Comments on Free Bus Scheme

అన్న క్యాంటీన్ వల్ల రూ.5లకే టిఫిన్, భోజనం వస్తోందని, ఈ పథకం వల్ల కూలీలు, పేదలకు ఎంతో మేలు కలుగుతోందంటూ సీఎం చంద్రబాబుకు మహిళలు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. మహిళలను గౌరవించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. ఆకాశంలో సగం అవనిలో సగం అంటూ మహిళలు కూటమి పాలనలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించటం ఆనందంగా ఉందన్నారు. బస్ స్టేషన్ లో అవ్వని, అమ్మనీ, ఎవ్వరిని పలకరించినా ఆనందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కు జేజేలు పలుకుతూ, హృదయ పూర్వకంగా అభినందనలను అందిస్తున్నారన్నారు.

Also Read : Deputy CM Pawan Shocking Comments : టీడీపీ ఎమ్మెల్యేపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ సీరియ‌స్

Exit mobile version