Minister Savitha : పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : మెడికల్ కాలేజీల నిర్మాణంపై ఉనికి కోసం వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనైనా పీపీపీ మోడల్ లో మెడికల్ కాలేజీలు నిర్మించి తీరుతామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత (Minister Savitha) స్పష్టం చేశారు. కల్తీ మద్యం తయారీలో అన్ని వేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయని, కల్తీ నెయ్యి ఘటనలో అన్ని కళ్లూ ఆ ప్యాలెస్ వైపే చూస్తున్నాయని, కల్తీకి కేరాఫ్ అడ్రాస్ జగన్ ప్యాలెస్ అని మంత్రి తీవ్రంగా విరుచుకుపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో సామూహిక గృహా ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. 17 మెడికల్ కాలేజీల నిర్మాణమంటూ అట్టాహాసంగా భూమి పూజ చేసిన జగన్ వాటిని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. 2014-19లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి గాలికి వదిలి వేశాడన్నారు సవిత.
Minister Savitha Comments
రాజధాని అమరావతిని, పోలవరాన్ని, బీసీ గురుకులాలను, టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పట్టించు కోలేదన్నారు. బీసీ గురుకులాలు, టిడ్కో ఇళ్లు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 70, 80 శాతం పూర్తయ్యాయని, నిధులున్నా ఆ నిర్మాణాలను పూర్తి చేయకుండా జగన్ అభివృద్ధిని అడ్డుకున్నాడని విమర్శించారు. చంద్రబాబుకు పేరు వస్తుందని ఆ నిర్మాణాలను అర్థాంతరం విడిచిపెట్టేశాడన్నారు. అభివృద్ధి నిరోధకుడు జగన్ అని మంత్రి సవిత ఘాటుగా విమర్శించారు. ప్రచార ఆర్భాటం కోసం 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామంటూ ఓ బూటకపు భూమి పూజ చేశాడని జగన్ పై మంత్రి సవిత మండిపడ్డారు. పీపీపీ మోడల్ అయితేనే మెడికల్ కాలేజీలు పూర్తవుతాయన్న విషయం జగన్ కు తెలుసన్నారు.
Also Read : CM Chandrababu Strong Focus CII : ఏపీ సీఐఐ 2025 సదస్సుపై సీఎం ఫోకస్
