CM Chandrababu Strong Focus CII : ఏపీ సీఐఐ 2025 స‌ద‌స్సుపై సీఎం ఫోక‌స్

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించాలి

Hello Telugu - CM Chandrababu Strong Focus CII

Hello Telugu - CM Chandrababu Strong Focus CII

CM Chandrababu : అమ‌రావ‌తి : భారీ ఎత్తున పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేందుకు ఏపీ స‌ర్కార్ ఫోక‌స్ పెట్టింది. ఈ మేర‌కు స‌మ‌ర్త‌త‌వంత‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందిన ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు (CM Chandrababu) ఆధ్వ‌ర్యంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సీఐఐ స‌ద‌స్సును విజ‌య‌వంతం చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్ర‌తి రోజూ ఆయ‌న స‌మీక్ష‌లు చేప‌డుతున్నారు. ఇప్ప‌టికే మంత్రుల‌కు, ఉన్న‌తాధికారుల‌కు విభాగాల వారీగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇది వ‌రుస‌గా నాలుగో స‌ద‌స్సు న‌గ‌రంలో నిర్వ‌హించ‌డం . ఇందుకు వేదిక కానుంది విశాఖ‌ప‌ట్నం. ఇదిలా ఉండ‌గా విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) సంయుక్తంగా నిర్వహిస్తోంది 30వ ‘సి.ఐ.ఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2025’.

CM Chandrababu Focus

ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ‘ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే సందేశాన్ని ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలని సంకల్పించారు. పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ – ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్-2047 థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం. సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని, ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు ఇప్పటికే సింగపూర్, యూఏఈ, యూకే వంటి దేశాల్లో పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తూ సీఎం రోడ్ షోలు, పర్యటనలు నిర్వహించారు.

Also Read : Hydraa Commissioner Shocking Comments : చెరువుల‌కు అందాలు అద్ద‌డం అభివృద్ధి కాదు

Exit mobile version