Minister Savitha Important Update : బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ కోచింగ్

వచ్చే నెల డిసెంబ‌ర్ 14 నుంచి ప్రారంభం

Hello Telugu - Minister Savitha Important Update

Hello Telugu - Minister Savitha Important Update

Minister Savitha : విజయవాడ : బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యంతో, బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో వచ్చే నెల 14వ తేదీ నుంచి ఉచిత సివిల్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అందజేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత (Minister Savitha) స్ప‌ష్టం చేశారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్ లో బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉచిత సివిల్ సర్వీసెస్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ కోసం తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. బీసీ బిడ్డలు ఉన్నత స్థానాల్లో నిలవాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రెండో విడత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వంద మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా గొల్లపూడి బీసీ భవన్ లో ఏర్పాట్లు చేయిస్తున్నామని చెప్పారు స‌విత‌.

Minister Savitha Key Comments

ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకూ దరఖాస్తుల స్వీరించనున్నామని, ఏడో తేదీన అర్హత పరీక్ష నిర్వహించనున్నామని వెల్ల‌డించారు. 11వ తేదీన అర్హత పరీక్ష నిర్వ‌హిస్తామ‌ని, అనంత‌రం ఉత్తీర్ణతా ఫలితాలు ప్రకటిస్తామ‌న్నారు. 14వ తేదీ నుంచి ఉచిత శిక్షణ ప్రారంభిచనున్నట్లు వెల్లడించారు మంత్రి స‌విత‌. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 12 వ తేదీన గొల్లపూడిలోని బీసీ భవన్ లో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన బీసీ అభ్యర్థులు ఉచిత సివిల్స్ శిక్షణకు అర్హులన్నారు. గతేడాది ఉచిత శిక్షణ పొందిన వారు కూడా మరోసారి దరఖాస్తు చేసుకునే అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు. ఉచిత సివిల్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ కు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించనున్న‌ట్లు తెలిపారు.

Also Read : M Venkaiah Naidu Important Comments : పాడి రైతులు సాధించిన విజ‌యం అద్భుతం

Exit mobile version