CM Chandrababu : అమరావతి : జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సమీక్ష చేపట్టారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం మంత్రివర్గ ఉప సంఘంతో భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి వర్గ ఉప సంఘం సభ్యులు అనగాని సత్యప్రసాద్, పి.నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరి చేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మంత్రి వర్గ ఉప సంఘం పలుమార్లు సమావేశమై వివిధ వర్గాలు, ప్రజాసంఘాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకున్నది.
CM Chandrababu Important Meeting
ఈ సందర్బంగా వారి నుంచి సేకరించిన సూచనలు, సలహాలతో కూడిన పూర్తి నివేదికను సీఎం చంద్రబాబు నాయుడు ముందు ఉంచింది. గత ప్రభుత్వం అడ్డగోలుగా, అశాస్త్రీయంగా జిల్లాలను విభజించిందని ఆరోపించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu). ఈ మేరకు మంత్రివర్గం ఉప సంఘం చేసిన సిఫారసులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మొంథా తుపాను కమ్ముకు వస్తోంది. ఈ తరుణంలో పెద్ద ఎత్తున ఈదురు గాలులు, వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు నిలిచి పోయిన తర్వాత తిరిగి జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. అందరికీ ఉపయోగకరంగా, ఆమోద యోగ్యంగా ఉండేలా ఉంటుందన్నారు చంద్రబాబు నాయుడు.
Also Read : Minister Jupalli Shocking Comments : దుష్ప్రచారంపై పరువు నష్టం దావా వేస్తా
