Minister Satya Kumar : అమరావతి : వైద్య రంగం పట్ల మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అసత్య ప్రచారంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satya Kumar) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే తాను చేసిన సవాల్ కు ఏ ఒక్కరు స్పందించ లేదన్నారు. పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. తన హయాంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలపై సాలీనా రూ.360 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో రూ.7,000 ఖర్చు చేయాలనడం సబబా అని నిలదీశారు మంత్రి సత్యకుమార్ యాదవ్. 17 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలపై నాలుగేళ్లలో రూ.1450 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
Minister Satya Kumar Slams YS Jagan Comments
జగన్ రెడ్డి కావాలని తమ సర్కార్ పై లేనిపోని ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2023-24లో ప్రవేశాలు జరిగిన 5 కళాశాలల్లో ఒక్కోదానికి 150 సీట్లు అనుమతించిన ఎన్ఎంసి మరుసటి ఏడాది పాడేరులో కేవలం 50 సీట్లు మాత్రమే ఎందుకు అనుమతించిందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పులివెందుల వైద్య కళాశాల ఖర్చు అంచనాలో 84 శాతం వ్యయం చేసిన జగన్ ఇతర కళాశాలల్లో కేవలం 10 శాతం మాత్రమే ఎందుకు ఖర్చు చేశారో క్లారిటీ ఇవ్వాలన్నారు సత్య కుమార్ యాదవ్.
తాను ప్రతిపాదించిన 17 వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద వార్షిక ఫీజును రూ. 20 లక్షలుగా ఎందుకు నిర్ణయించారో చెప్పాలన్నారు. రూ.20 లక్షల వార్షిక ఫీజుతో అతి తక్కువ ఖర్చుతో పేదలకు వైద్య విద్య లభిస్తుందనడం వాస్తవ విరుద్ధం కాదా అని నిలదీశారు. పులివెందుల వైద్య కళాశాలలో బోధనా సిబ్బంది లోటు 48 శాతం ఉన్నట్లు ఎన్ఎంసి ఇచ్చిన నివేదికపై జగన్ సమాధానం చెప్పాలన్నారు.అధికారం నుండి దిగి పోయే నాటికి జగన్ ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2,500 కోట్లు ఉంచిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. అందరికీ వైద్య బీమా పథకంపై జగన్ ఆరోపణలను ఖండించారు.
Also Read : Chinta Mohan Fired on CM Chandrababu : ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారు
