Minister Satya Kumar Yadav Strong Focus : బెజ‌వాడ‌ ఉత్స‌వాల ఏర్పాట్ల‌పై ఫోక‌స్

దృష్టి సారించిన మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్

Hello Telugu - Minister Satya Kumar Yadav Strong Focus

Hello Telugu - Minister Satya Kumar Yadav Strong Focus

Satya Kumar Yadav : విజ‌య‌వాడ : వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఉత్స‌వాల స‌న్నాహ‌క స‌మావేశానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. ఈ కీల‌క కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు ఉమ్మ‌డి కృష్ణా జిల్లా మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి నాయకులు .విజయవాడ ఉత్సవాలను దిగ్విజయం చేయడంపై ప్రజా పత్రినిధుల విస్తృతంగా చర్చలు జ‌రిపారు. ఈ సంద‌ర్బంగా స‌త్య కుమార్ యాద‌వ్ (Satya Kumar Yadav) ప్ర‌సంగించారు. 11 రోజుల పాటు బెజ‌వాడ‌ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుందామ‌ని పిలుపునిచ్చారు. అంతరించి పోతున్న కళలను పరిరక్షించుకునేలా వేడుకలు నిర్వహించాల‌ని కోరారు.

Minister Satya Kumar Yadav Comments

పెద్ద ఎత్తున అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఇందులో మ‌మేకం చేయాల‌ని పిలుపునిచ్చారు మంత్రి. దసరా అంటే ప్రజలకు విజయవాడ వెళ్లాలని అనిపించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామ‌ని చెప్పారు స‌త్య కుమార్ యాద‌వ్. విజయవాడను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఈ వేడుకలు దోహద పడతాయన్నారు . ఈ ఏడాది మొదలు పెట్టిన చిన్న ప్రయత్నం ప్రపంచానికి పాకేలా చేస్తామ‌న్నారు. ఈ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్న సమయంలో త‌న‌కు భాగస్వామ్యం కల్పించటం సంతోషంగా ఉంద‌న్నారు మంత్రి. దసరా అంటే దేశం అంతా విజయవాడ వైపు చూసేలా నిర్వహిస్తామ‌ని ప్ర‌క‌టించారు. మైసూర్ తరహాలో విజయవాడ ఫెస్ట్ చేప‌డ‌తామన్నారు.

Also Read : BJP Strong Demand : రూ. 8 వేల కోట్ల ఫీజు బ‌కాయిలు చెల్లించాలి

Exit mobile version