గ్రామాల్లో పరుగులు తీస్తున్న అభివృద్ధి : స‌విత

మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై సీరియ‌స్ కామెంట్స్

hellottelugu-Ministeravitha

రొద్దం/పెనుకొండ : సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాకతో పంచాయతీలకు ఎప్పటికప్పుడు నిధులందిస్తూ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత‌, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్ర‌క‌టించారు. గత ప్రభుత్వంలో జగన్ గద్ద పంచాయతీల నిధులు తన్నుకెళ్లిపోయిందని విమర్శించారు. పెనుకొండ నియోజక వర్గంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 18 విలేజ్ క్లినిక్ లకు కూటమి ప్రభుత్వం రూ.10.50 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అంద జేస్తున్నామని, ప్రతి నెలా ఒకటో తేదీన సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నట్లు చెప్పారు. రొద్దం మండలంలోని సానిపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి మంత్రి సవిత పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో రూ.38 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో మంత్రి సవిత మాట్లాడారు. ప్రతి నెలా ఒకటో తేదీన రాష్ట్రంలో పెన్షన్ల పండుగ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో భాగంగా 63.26 లక్షల మందికి రూ. 2,738 కోట్లు అందజేస్తున్న‌ట్లు తెలిపారు. జిల్లాలో 2.63 లక్షల మందికి రూ.115 కోట్లు, పెనుకొండ నియోజక వర్గంలో 41 వేల మందికి రూ.18 కోట్లు పంపిణీ చేశామన్నారు. రొద్దం మండలంలో 7,325 మందికి రూ.3.50 కోట్లు, సానిపల్లిలో 346 మందికి రూ.15 లక్షలు అందజేశామన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన అందజేసే ఈ పెన్షన్ల పండగ కార్యక్రమంలో స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని లబ్ధిదారులకు తన చేతుల మీదుగా పెన్షన్లు అందజేస్తుంటారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా అందజేసిన సందర్భాల్లేవన్నారు.

Exit mobile version