హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులు ఒక్కరొక్కరుగా బయట పడుతున్నారు. రాష్ట్ర అవినీతి శాఖ చరిత్రలోనే ఒక మధ్యస్థాయి పోలీస్ అధికారి పోగేసిన ఆస్తులను చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. తాజాగా ఏసీబీ డీఎస్పీ భీమ్ రెడ్డి నివాసాలపై సోదాలు చేపట్టింది. ఏకంగా ఆయన అక్రమ ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ. 200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. తాజాగా ఏసీబీ ఇందుకు సంబంధించి మనోడు దర్జాగా సంపాదించిన ఆస్తుల వివరాలు ప్రకటించింది.
ఇబ్రహీంబాగ్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో ఒక విల్లా, టెలికాం నగర్‌లో ఒక నివాస గృహం (జి+2+పెంట్ హౌస్),
టెలికాం నగర్‌లోని సాయి ప్రభా రెసిడెన్సీలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలి లోని క్రాంతి సియోన్ లో ఒక అపార్ట్మెంట్. మణికొండ, లాంకోహిల్స్ రోడ్డులో 500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న G+5 వాణిజ్య సముదాయంలో వాటా కలిగి ఉన్నాడు భీమ్ రెడ్డి. మణికొండ మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో 3000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఒక వాణిజ్య స్థలం. తెల్లాపూర్‌లోని అభినంద రెసిడెన్సీలో రెండు నివాస ఫ్లాట్లు.
ప్రగతి రిసార్ట్స్‌లో 500 చదరపు గజాల ఒక ఖాళీ స్థలం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి. కర్ణాటకలో 6-00 ఎకరాల పొలం . కర్ణాటకలో మరో 38 ఎకరాల వ్యవసాయ భూమి, బెంగళూరులోని దేవనహళ్లిలో 1 ఎకరం భూమి, నాగోల్‌లోని కామినేని ఆసుపత్రి సమీపంలో 200 చదరపు గజాల విస్తీర్ణం గల ఒక ఖాళీ స్థలం, జిపిఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 చదరపు గజాల విస్తీర్ణం గల ఒక ఖాళీ స్థలం, పటాన్‌చెరులో 200 చదరపు గజాల విస్తీర్ణం గల ఒక ఖాళీ స్థలం, వికారాబాద్ జిల్లాలోని మిన్‌పేట్‌లో 1,000 చదరపు గజాల విస్తీర్ణం గల ఒక భూమి పార్ట్ , మోమిన్‌పేట్‌లో 2 ఎకరాల వ్యవసాయ భూమి, మెస్సర్స్ శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్‌లో రూ. 75,00,000/- పెట్టుబడి పెట్టాడు.
అంతే కాకుండా పాలమూరు జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్న చింతకుంట మండలం ముచ్చింతల గ్రామంలో 4-20 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు వెల్లడించింది ఏసీబీ. ఇంకా, సోదాల సమయంలో, ఏఓ ఇంట్లో సుమారు రూ. 3.60 లక్షల నికర నగదు, అతని బినామీ ఇంట్లో మరో రూ. 40 లక్షల నికర నగదు లభ్యమైంది. సుమారు 2 కిలోగ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు 20 కిలోగ్రాముల వెండి వస్తువులు , సుమారు రూ. 19 లక్షల 91 వేల బ్యాంకు నిల్వలు కూడా లభించాయి.
