అమెరికా : యుఎస్ఏ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని సుంకాలు అడ్డుకున్నాయనిమరోసారి పేర్కొన్నారు. సంఘర్షణను నివారించడానికి రెండు దేశాలకు 200 శాతం సుంకాలు విధిస్తానని బెదిరించినట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు; అయితే, ద్వైపాక్షిక సైనిక చర్చల ద్వారానే కాల్పుల విరమణ సాధ్యమైందని భారత్ పునరుద్ఘాటించింది. భారీ సుంకాలతో బెదిరించడం ద్వారా భారత్ , పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని అడ్డుకున్నానని , ఇదంతా తన వల్లనే జరిగిందని చెప్పుకువచ్చారు ట్రంప్. తన అధ్యక్ష పదవీకాలంలో ఎనిమిది యుద్ధాలను ఆపడంలో తన వాణిజ్య విధానం సహాయ పడిందని ఆయన చెప్పారు.
ట్రంప్ సీఎన్బీసీకి ఇచ్చిన ప్రత్యేకంగా మాట్లాడారు. ఇలాగే మీరు యుద్దానికి దిగితే తాను ఊరుకునేది లేదని స్పష్టం చేశానన్నారు తెలిపారు. న్యూఢిల్లీ, ఇస్లామాద్ ల పై భారీ సుంకాలు విధిస్తామంటూ బెదిరించానని చెప్పారు. సుంకాల కారణంగా నేను ఎనిమిది యుద్ధాలను ఆపానని ప్రకటించారు. భారత్ , పాకిస్థాన్ విషయంలోనూ నేను అలాగే చేశాను అని ట్రంప్ అన్నారు. ఆ ఎనిమిది సంఘర్షణలలో ఐదు సుంకాల బెదిరింపుల వల్లే ఆగిపోయాయని ఆయన పేర్కొన్నారు. అణు ఆయుధాలు కలిగిన ఈ రెండు పొరుగు దేశాలు పెద్ద ఎత్తున సంఘర్షణకు దిగే అంచున ఉన్నాయని ,అవి యుద్ధానికి సిద్ధమయ్యాయి, పైగా అవి అణు దేశాలు అని ట్రంప్ అన్నారు. సంఘర్షణను నివారించడం ద్వారా తాను కనీసం 3 కోట్ల (30 మిలియన్ల) మంది ప్రాణాలను కాపాడానని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు చెప్పారని కూడా ఆయన పేర్కొన్నారు.
