Minister Ram Prasad : అమరావతి : ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Ram Prasad) కీలక ప్రకటన చేశారు. ఈనెల 16న రాష్ట్రంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా మంగళవారం మంత్రి సమీక్ష చేపట్టారు. ఆరోజు సాయంత్రం కర్నూల్ లో కూటమి సర్కార్ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సక్సెస్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే డీజేపీ సారథ్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారని తెలిపారు. 1800 మందికి పైగా ఉన్నతాధికారులు, పోలీసులు భాగం కానున్నారని చెప్పారు. సమీక్ష అనంతరం మంత్రి రాం ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Minister Ram Prasad Deployed
జీఎస్టీ తగ్గింపుపై ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న జీఎస్టీ నిర్ణయం చారిత్రాత్మకం అని పేర్కొన్నారు మందిపల్లి రాం ప్రసాద్ రెడ్డి. నంద్యాల జిల్లాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు నిరంతరం ఆర్టీసీ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని పర్యటన దృష్ట్యా 3,500 బస్సులు సిద్ధం చేయాలని ఆదేశించారు. కర్నూలు జిల్లా నన్నూరులో జరిగే ప్రధాని సభ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. శ్రీశైలం పర్యటన కోసం అదనంగా 150 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. పోలీసులు, భద్రతా సిబ్బందికి రవాణా కోసం 80 బస్సులు కేటాయించామన్నారు. పూర్తి ఫిట్‌నెస్ బస్సులను మాత్రమే వినియోగిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
Also Read : Ex Minister Harish Rao Fired on CM : నిధుల లేమితో గురుకులాలకు ఇక్కట్లు


















