GHMC Commissioner Shocking Comments : ఓట్ చోరీ బాగోతంపై విచార‌ణ‌కు ఆదేశం

ఎన్నిక‌ల అధికారి , జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్

Hello Telugu - GHMC Commissioner Shocking Comments

Hello Telugu - GHMC Commissioner Shocking Comments

GHMC Commissioner : హైద‌రాబాద్ : ఎన్నిక‌ల అధికారి, హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ క‌ర్ణ‌న్ (GHMC Commissioner) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. జూబ్లీహిల్స్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ మేర‌కు బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఈ ఓట్ చోరీ బాగోతం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీసింది. దీంతో ఈ అంశం ర‌చ్చ‌కు దారి తీయ‌డంతో స్పందించారు ఎన్నిక‌ల అధికారి , క‌మిష‌న‌ర్ క‌ర్ణ‌న్ విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ విష‌యాన్ని ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వెల్ల‌డించారు.

GHMC Commissioner Shocking Comments

యూసుఫ్ గూడ డివిజన్ కృష్ణానగర్‌లోని 8-3-231/బీ/160 ఇంట్లో ఇటీవల 43 ఓట్లు నమోదు అయిన‌ట్లు బీఆర్ఎస్ బూత్ ఇంఛార్జీలు క‌నుగొన్నారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని కేటీఆర్, త‌దిత‌రులు కోర‌డ‌తో దీనిని సుమోటోగా స్వీకరించి, విచారణకు ఆదేశించిన‌ట్లు తెలిపారు జిల్లా ఎన్నిక‌ల అధికారి. ఇదిలా ఉండ‌గా 8- 3- 231/B/160, 8-3-231/B/118, 8-3-231/B/119, 8-3-231/B/164 గల ఇంటి నంబర్లలో భారీగా ఓట్లు న‌మోదైన‌ట్లు తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే ఈ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న‌ది కేవ‌లం ఇద్ద‌రు ముగ్గురు మాత్ర‌మే ఉన్నార‌ని కేటీఆర్ ఆరోపించారు. ఇది వోట్ చోరీ కాదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీని, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు నెటిజ‌న్లు.

Also Read : CM Revanth Reddy Strong Focus : సంక్షేమ వ‌స‌తి గృహాల‌పై దృష్టి సారించాలి

Exit mobile version