Minister Payyavula : అమరావతి : ఏపీ రాష్ట్ర ఆర్థిక , శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కలెక్టర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న 4 వ జిల్లా కలెక్టర్ల సమావేశం లో సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పయ్యావుల కేశవ్ (Minister Payyavula) మాట్లాడారు. ప్రభుత్వ ముఖ చిత్రాన్ని క్షేత్ర స్థాయిలో ప్రతిభవించే విధంగా జిల్లా కలెక్టర్లలు కృషి చేయాలని స్పష్టం చేశారు. కొత్త విషయాలను కొత్తగా ఆలోచించే ఎనర్జీ, జీల్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పని చేయాలని, ఇదే సమయంలో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్య మంత్రి ఉన్నత స్థాయి ఆలోచనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ ఎదగాలన్నారు, ప్రజలకు సంతృప్తి స్థాయిలో సేవలు అంద చేయాలని కోరారు.
Minister Payyavula Keshav Key Comments
ఏ ప్రభుత్వంలోనూ ప్రణాళిక శాఖలకు ఎవరు అంతగా ప్రాధాన్యత ఇవ్వరని అన్నారు. కానీ ఈ ముఖ్య మంత్రి ఎంతో ఉన్నతంగా ఈ శాఖను వినియోగించు కోవడం వల్ల GSDP సాధనలో దేశంలోనే ప్రథమ స్థానంలో రాష్ట్రాన్ని నిలపడం జరిగిందని చెప్పారు మంత్రి పయ్యావుల కేశవ్. జాతీయస్థాయి GSDP 8.8% ను అధిగమిస్తూ రాష్ట్ర GSDP 10.8% ని సాధించడం జరిగిందన్నారు. వినూత్న ఆలోచనలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వస్తూ రాష్ట్ర ఆదాయాన్ని, సంపదను సృష్టించడం జరుగుతున్నదని పేర్కొన్నారు కేశవ్. రాష్ట్ర ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకుంటూ జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో అంకితభావంతో పనిచేస్తూ 2026 కార్యచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని పిలుపునిచ్చారు.
Also Read : Urvashi Rautela Shocking : నటి ఊర్వశి రౌటేలాకు షాక్ ఈడీ నోటీస్
