Minister Parthasarathy Fired on YS Jagan : సంక్షేమ ప‌థ‌కాలు సెన్సేష‌న్ జ‌గ‌న్ ఫ్ర‌స్ట్రేష‌న్

గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి

Hello Telugu - Minister Parthasarathy Fired on YS Jagan

Hello Telugu - Minister Parthasarathy Fired on YS Jagan

Minister Parthasarathy : అమ‌రావ‌తి – కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చూసి జగన్ లో ఫ్రస్టేషన్ పెరిగి పోయి ఉచ్చనీచాలు మరచి దిగజారి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడని మండిప‌డ్డారు సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి (Minister Parthasarathy). ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలు, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరు, వారు రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్న విధ్వంసకర విధానాలు చూస్తుంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా చాలా బాధేస్తుందన్నారు. రెండున్నర మూడు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నానని అన్నారు. నా తండ్రి కూడా ఎమ్మెల్యేగా, ఎంపీ గా పని చేయడంతో రాజకీయాలని చాలా దగ్గరగా నాలుగైదు దశాబ్దాల నుంచి చూస్తూ ఉన్నానని చెప్పారు. కానీ ఇటువంటి పరిస్థితి, ఇటువంటి వాతావరణం ఈ విధంగా వ్యవహరిస్తు పార్టీ, నేతలను ఏనాడు చూడ లేద‌న్నారు.

Minister Parthasarathy Slams YS Jagan

రాజకీయ పార్టీలు అన్నీ కూడా చాలా ఘాటుగా ప్రభుత్వాలను విమర్శించినా కూడా ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణలు చేయ లేద‌న్నారు. కించపరిచే విధంగా మాట్లాడటం, అప్రజాస్వామికంగా మాట్లాడటం ఎక్కడ కూడా చూడలేదని చెప్పారు. అధికార పక్షాన్ని కించ పరచడం కోసం అరాచక శక్తులని ప్రోత్సహించడం ఎప్పుడూ చూడలేదన్నారు. హుందాగా ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజా సమస్యలే ప్రాధాన్యంగా పోరాటాలు చేసేవారన్నారు. ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తా ఉంటే చాలా బాధేస్తుందన్నారు పార్థ‌సార‌థి . గెలుపు ఓటములు సర్వ సాధారణం కానీ ప్రతి వ్యక్తి కూడా గెలిసినా ఓడినా నైతిక రాజకీయాలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. బహుశా వైనాట్ 175 నుంచి 11 స్థానాలకి పడిపోవడం మూలంగా ఆయన ఈ విధంగా అనైతికంగా, అప్రజాస్వామికంగా విధ్వంసకర పరిస్థితులను ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తున్నారు అనిపిస్తోంద‌న్నారు.

ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి క్రింది స్థాయి నాయకులకు ఆదర్శంగా ఉండాలన్నారు. అనైతికంగా మాట్లాడటం అనేది చాలా తప్పు. మాటల్లో నియంత్రణ కోల్పోవటం. వ్యక్తిగత దూషణలకి దిగటం పరిపాటిగా మారింద‌న్నారు. తాను ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర ఇంతకు ముందు పని చేశానని, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రిమండలిలో ఉన్నానని పేర్కొన్నారు. గతంలో నేను మంత్రిగా పని చేసినప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి , రోశ‌య్య‌, కిర‌ణ్ కుమార్ రెడ్డి ఏదైనా త‌ప్పు మాట్లాడితే హెచ్చ‌రించే వార‌న్నారు. కానీ జ‌గ‌న్ లో ఇంకా నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు లేవ‌న్నారు.

Also Read : Minister TG Bharat Interesting Update : క‌ర్నూల్ లో హైకోర్టు బెంచ్ సిద్దం – టీజీ భ‌ర‌త్

Exit mobile version