Minister TG Bharat Interesting Update : క‌ర్నూల్ లో హైకోర్టు బెంచ్ సిద్దం – టీజీ భ‌ర‌త్

పత్తికొండలో టమోటా ప్రాసింగ్ పరిశ్రమ‌

Hello Telugu - Minister TG Bharat Interesting Update

Hello Telugu - Minister TG Bharat Interesting Update

TG Bharat : అమ‌రావ‌తి – ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ (TG Bharat) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రో మూడు నెల‌ల్లో క‌ర్నూలులో హైకోర్టు బెంచ్ పూర్త‌వుతుంద‌ని వెల్ల‌డించారు. సింగపూర్ పర్యటన సక్సెస్ అయ్యింద‌న్నారు. రాష్ట్రంలో అపార వనరులున్నాయని, వ్యాపార అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో వచ్చి ప్రగతిలో భాగస్వాములు కావాలని సీఎం చంద్ర‌బాబు సింగపూర్‌లోని వివిధ దిగ్గజ సంస్థల ప్రతినిధులను కోరారని చెప్పారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రభుత్వం రూపొందించుకున్న ప్రణాళికలను వివ‌రించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.

Minister TG Bharat Key Comments on Kurnool High Court Bench

వివిధ రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి…కీలక కంపెనీలుగా ఉన్న కెపిటా ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వేర్వేరుగా భేటీ అయ్యారని తెలిపారు. రియలెస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీయల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజటల్ టౌన్ షిప్స్ వంటి అంశాలపై కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా) ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరీశంకర్ నాగభూషణంలతో సీఎం చర్చించారన్నారు.

అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కులు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని తెలిపామ‌న్నారు టీజీ భ‌ర‌త్ (TG Bharat). రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టుల ద్వారా అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించు కున్నామనే అంశాన్ని చ‌ర్చించామ‌న్నారు. హైదరాబాద్-బెంగళూరు-అమరావతి-చెన్నైల మధ్య ఎయిర్ పోర్టు ఎకనమిక్ కారిడార్ గురించి సీఎం ఆ సంస్థ ప్రతినిధులకు చెప్పార‌ని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం ఐటీ పార్కుల్లో 30-35 శాతం ఐటీ పార్కుల్లో తాము పెట్టుబడులు పెట్టామని ఆ సంస్థ ప్రతినిధులు చంద్రబాబు దృష్టికి తెచ్చారని పేర్్కొన్నారు. రియల్ ఎస్టేట్ సహా పారిశ్రామిక రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కెపిటాల్యాండ్ ఇండియా ప్రతినిధులు ఆసక్తి కనబరిచార‌ని పేర్కొన్నారు.

వైజాగ్, తిరుపతి వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం రంగంలో భాగస్వామ్యంతో వెళ్తే మంచి చక్కటి అభివృద్ధి సాధించవచ్చని సీఈఓ మైక్ బార్క్‌లేకు సీఎం సూచించార‌ని తెలిపారు. సింగపూర్ గార్డెన్ సిటీ, జూ పార్క్ మోడళ్లను ఏపీలో అమలు చేసే అంశంపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందన్నారు. వైజాగ్‌లో డాల్ఫిన్ సిటీ, అమరావతిలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలతో వెళ్తున్నామని.. వాటిల్లో మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలని కోరామ‌న్నారు. ఈ మేరకు ఆయా రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బార్క్ లే సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు.

Also Read : MLC Kavitha Shocking Comments : న‌న్ను డ్యామేజ్ చేయ‌డంలో బీఆర్ఎస్ నేత హ‌స్తం

Exit mobile version