Minister Nimmala : అమరావతి : ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala) సమీక్ష చేపట్టారు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఉత్తరాంద్ర సిఈ, ఎస్ఈలు, ఈఈలు, ఇతర అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. గత 5ఏళ్ళ వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు 2014-19 టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు చేపట్టిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను సైతం జగన్ నిలిపేశాడని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిఎం చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకునేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
Minister Nimmala Rama Naidu Key Update
చంద్రబాబు ఆదేశాలతో ఉత్తరాంధ్రలో రాబోయే రెండేళ్ళలో రూ.2వేల కోట్లు పైగా ఖర్చు చేసి, కీలక ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బిఆర్‌ఆర్ వంశధార, తోటపల్లి, వంశధార-నాగావళి లింక్, జంఝావతి రిజర్వాయర్, హిరమండలం లిఫ్ట్, నాగావళి- చంపావతి, మహేంద్ర తనయ, తారక రామతీర్ధ సాగర్, మడ్డువలస రిజర్వాయర్, వంటి కీలకమైన ప్రాజెక్టులను పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. కీలకమైన 9 ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో 1.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రావడంతో పాటు, 2.48లక్షల ఎకరాల ఆయకట్టు స్ధిరీకరణ సాధ్యమవుతుందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకు రావడంతో పాటు, కరువు ప్రాంతాలకు ప్రయోజనం కల్గించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.
Also Read : YS Sharmila Shocking Comments on Modi : ఓట్ల చోరీకి పాల్పడిన మోదీ : వైఎస్ షర్మిల
