YS Sharmila Shocking Comments on Modi : ఓట్ల చోరీకి పాల్ప‌డిన మోదీ : వైఎస్ ష‌ర్మిల‌

రాహుల్ గాంధీపై సంచ‌ల‌న కామెంట్స్

Hello Telugu - YS Sharmila Shocking Comments on Modi

Hello Telugu - YS Sharmila Shocking Comments on Modi

YS Sharmila : అమ‌రావ‌తి : ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైస్ ష‌ర్మిలా రెడ్డి (YS Sharmila) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని మోదీ ఓట్ల చోరీకి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. త‌మ అధినాయ‌కుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోప‌ణ‌ల‌పై స్పందించాల‌ని డిమాండ్ చేశారు. హర్యానాలో రాహుల్ పేల్చింది హై ఓల్టేజ్ హైడ్రోజన్ బాంబు అని పేర్కొన్నారు. 25 లక్షల దొంగ ఓట్లు సృష్టించి సర్కార్ చోరీకి పాల్పడ్డార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఓట్ చోర్ గద్దె చోర్ క్యాంపెయిన్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి 17.65 లక్షల సంతకాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. వీటిని ఢిల్లీకి పంపిస్తున్నామ‌న్నారు. ఇది మోడీ మోసం మీద పేల్చిన బాంబు అని పేర్కొన్నారు. ఇది ECI చేస్తున్న దగా మీద పేల్చిన బాంబు అని పేర్కొన్నారు.

YS Sharmila Shocking Allegations on PM Modi

గురువారం వైఎస్ ష‌ర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. దొంగ ఓట్లపై రాహుల్ తీగ లాగుతున్నాడని అన్నారు. అన్ని నిజాలు బయట పడుతున్నాయన్నారు. ఇప్పటికే కర్ణాటకలో,మహారాష్ట్రలో దొంగ ఓట్ల నిజాలు బయట పెట్టార‌ని, దీనిపై ఈసీ, కేంద్రం ఎందుకు నోరు విప్ప‌డం లేదంటూ ప్ర‌శ్నించారు. ఇప్పుడు హర్యానాలో ఏకంగా 25 లక్షల దొంగ ఓట్లను వెలికి తీశాడని అన్నారు. హర్యానాలో బీజేపీ గెలుపు కోసం 25 లక్షల దొంగ ఓట్లను ECI చేర్చిందని మండిప‌డ్డారు ష‌ర్మిలా రెడ్డి. దేశం ముందు ECI బాగోతాన్ని ,సత్యాన్ని రాహుల్ దేశం ముందు పెట్టారని చెప్పారు. హర్యానాలో 8 ఓట్లకు ఒకటి దొంగ ఓటు ఉందంటూ బాంబు పేల్చార‌ని అన్నారు . త‌మ పార్టీకి బీజేపీకి మ‌ధ్య పెద్ద‌గా ఓట్ షేరింగ్ లేద‌న్నారు.

Also Read : Prashant Kishor Shocking Comments : రాహుల్ ఓట్ చోరీపై ప్ర‌శాంత్ కిషోర్ కామెంట్స్

Exit mobile version