Minister Nimmala : తిరుమల – తమ కూటమి ప్రభుత్వం కొలువు తీరాక తిరుమల పుణ్య క్షేత్రానికి పూర్వ వైభవం తీసుకు వచ్చేలా చేశామన్నారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala). ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రైల్వే ద్వారా తిరుపతికి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు ఎస్పీ . అక్కడి నుంచి నేరుగా తిరుమలకు చేరుకున్నారు. గవర్నర్ రాక సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.
Minister Nimmala Ramanaidu Key Comments on TTD
ఇదిలా ఉండగా మంత్రి నిమ్మల రామానాయుడు కుటుంబ సభ్యులతో కలసి అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ గోవిందుడిని దర్శించుకున్నారు. తిరుమల ఆధ్యాత్మికతను, పవిత్రతను కాపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. దైవ దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులకు, అన్నదానం తో పాటు, ఇతర అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక, తిరుమల పవిత్రతను కాపడేలా, పూర్వ వైభవం తీసుకు వచ్చారంటూ భక్తులు తనకు చెప్పారని తెలిపారు.
అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ లు త్వరిత గతిన పూర్తి అయి, యువతకు లక్షలాది ఉద్యోగాలు, రాష్ట్రం సుభిక్షం గా ఉండాలని గోవిందుడిని వేడుకున్నానని చెప్పారు నిమ్మల రామానాయుడు. గత ఏడాది రాయలసీమ లో రిజర్వాయర్లు అన్ని నిండి, ప్రజలు సుఖ సంతోషాల తో ఉన్నారని అన్నారు. 25 ఏళ్ళ చరిత్రలో మెదటి సారి జులై లో శ్రీశైలం నుండి కృష్ణా జలాలు విడుదల చేశామన్నారు. హంద్రీనీవా ద్వారా 3850 క్యూసెక్కుల కృష్ణా జలాలను అడివిపల్లి రిజర్వాయర్ లో నింపి, నీవా కాలువ ద్వారా భవిష్యత్ లో తిరుపతి కి తాగు, పారిశ్రామిక అవసరాలకు నీళ్లను అందిస్తామన్నారు.
Also Read : CM Revanth Reddy Interesting : జైపాల్ రెడ్డి వల్లనే తెలంగాణ ఏర్పాటు – సీఎం
